అక్కినేని నాగార్జున గత కొద్ది రోజులుగా చేస్తున్న సినిమాలు ఆయన ఫాన్స్ ని శాటిస్ ఫై చెయ్యడం లేదు. గత ఏడాది వైల్డ్ డాగ్ చేసిన నాగార్జున ఆ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసి సేఫ్ అయ్యారు. ఆ సినిమాలో నాగార్జున వయసు కొట్టచ్చినట్టుగా కనిపించింది. ఆ తర్వాత నాగ చైతన్య తో కలిసి బంగార్రాజు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యగా.. ఆ సినిమా హిట్ అయినప్పటికీ.. ఆ హిట్ నాగ చైతన్య ఖాతాలోనే పడింది. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చెయ్యగా.. ఆ మూవీ ఇప్పుడు ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదటి మూడు రోజూ కల్లెక్షన్స్ అంతంతమాత్రం గారు ఉన్నాయి.
ఈ వీకెండ్ దాటితే ద ఘోస్ట్ కలెక్షన్స్ మరింతగా పడిపోయే అవకాశాలు లేకపోలేదు. దానితో నాగార్జున కూడా డిస్పాయింట్ అయ్యినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కినేని ఫాన్స్ ఆయన్ని కొద్దిరోజులు సినిమాల నుండి విరామం తీసుకోమని సలహాలిస్తున్నారట. ఇప్పటికే నాగార్జున ఘోస్ట్ తర్వాత ఆరు నెలలు విరామం తీసుకుని బెస్ట్ స్క్రిప్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తాను, అది ఓటిటి కంటెంట్ అయినా ఓకె అని చెప్పారు. మరి ఘోస్ట్ రిజల్ట్ నాగ్ నే కాదు ఆయన ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేయబట్టే వాళ్ళు అలా రిక్వెస్ట్ చేస్తున్నారు.