Advertisementt

భారీ ధరకు సలార్ శాటిలైట్ హక్కులు

Sat 08th Oct 2022 06:37 PM
salaar,star maa,prabhas  భారీ ధరకు సలార్ శాటిలైట్ హక్కులు
Salaar satellite rights owned by this channel భారీ ధరకు సలార్ శాటిలైట్ హక్కులు
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఫాన్స్ కి గుర్తుపెట్టుకొని సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటే.. వారిని తీవ్రంగా డిస్పాయింట్ చేసిన ఆదిపురుష్ టీజర్ ని 3D లో వదిలి కాస్త సంతృప్తి పరిచారు. అదలా ఉంటే ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా.. ప్రభాస్ బర్త్ డే టైం కి సలార్ టీజర్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ తో ఈ రెండు షెడ్యూల్స్ లోను ప్రశాంత్ నీల్ యాక్షన్ సీన్స్ నే తెరకెక్కించారు. ఊర మాస్ గా ప్రభాస్ లుక్ సలార్ లో కనబడుతుంది.

సలార్ పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా లో భీభత్సమైన క్రేజ్ ఉన్న ఈ సినిమాకి తెలుగు నుండి భారీ శాటిలైట్ ఆఫర్ వచినట్టుగా తెలుస్తుంది. తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్‌కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.. అని ఈ నేపథ్యంలో తాజాగా ఈ హక్కులను స్టార్ మా సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తుంది. దానికోసం స్టార్ మా కొన్ని కోట్ల రూపాయలను సలార్ మేకర్స్ కి చెల్లించినట్లు తెలుస్తుంది. దీంతో స్టార్ మా భారీ ధరకు కొనుగోలు చేసిన అతి తక్కువ చిత్రాల్లో సలార్ ఒకటిగా నిలిచిందని అంటున్నారు. 

Salaar satellite rights owned by this channel :

Salaar satellite rights owned by this channel for a whopping price

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ