బిగ్ బాస్ 6 ఇప్పటికే ఐదు వారలు పూర్తి చేసుకుని ఆరోవారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. ఇప్పుడు ఈ వారంనామినేషన్స్ లో ఇనాయా సుల్తానా, మరీనా, బాలాదిత్య, చంటి, ఫైమా, వాసంతి, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో సింగర్ రేవంత్ కెప్టెన్ అవతారమెత్తాడు. మొదటి నాలుగు వారాల్లో కెప్టెన్ అవ్వడానికి చాలా కష్టపడిన అతన్ని కెప్టెన్ అవ్వనివ్వకుండా హౌస్ మేట్స్ లో చాలామంది అడ్డుపడ్డారు. కానీ నాలుగో వారంలో చివరికి హౌస్ మేట్స్ మద్దతుతో రేవంత్ కెప్టెన్ అయ్యాడు. తర్వాత ఓ టాస్క్ లో బాలాదిత్యకి గీతు మధ్యన గొడవ జరిగింది.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్లలో ఇనాయ -ఫైమాలు పోటాపోటీగా ఓట్స్ దండుకున్నారు. ఒకరోజు ఇనాయ టాప్ లో ఉంటే.. మరో రోజు ఫైమా ఇలా అన్నమాట. తర్వాత స్థానాల్లోనూ చాలా మార్పులే కనిపించాయి. నెంబర్ వన్ ప్లేస్ లో ఫైమా ఉండగా.. రెండో స్థానంలో ఇనాయ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వారం ఓటింగ్ ముగిసే సమయానికి అర్జున్ కల్యాణ్ మూడో స్థానంలో, వాసంతి నాలుగో స్థానంలో, నిన్నటి వరకూ చివర్లో ఉన్న చంటి అనూహ్యంగా ఐదో స్థానంలోకి రాగా.. తర్వాత స్థానాల్లో ఆదిరెడ్డి, మరీనా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫైనల్ గా ఈ వారం ఆది రెడ్డి కానీ, మరీనా కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఎవరు ఈ వారం బయటికి వెళతారో మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ లీకులు చెప్పేస్తాయి.