Advertisementt

అప్ డేట్ లేకున్నా ట్రెండ్ చేస్తాం: తారక్ ఫాన్స్

Fri 07th Oct 2022 08:41 PM
ntr30,tarak,jr ntr  అప్ డేట్ లేకున్నా ట్రెండ్ చేస్తాం: తారక్ ఫాన్స్
NTR30 hashtag trends on twitter అప్ డేట్ లేకున్నా ట్రెండ్ చేస్తాం: తారక్ ఫాన్స్
Advertisement
Ads by CJ

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ బాగా ఆకలిమీదుతున్నారు. ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తెరకెక్కబోయే NTR30 అప్ డేట్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ సినిమా నుండి అప్ డేట్ వస్తుందా ట్రెండ్ చెయ్యాలనే కసి వాళ్లలో కనిపిస్తుంది. విజయ దశమికి NTR30 వార్త ఎమన్నా తెలుస్తుందేమో అని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ ఆశ అడియాసే అయ్యింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫాన్స్ రెచ్చిపోయి NTR30 హాష్ టాగ్ తో దుమ్మురేపుతున్నారు. అక్టోబర్ 10 న NTR30 మొదలు కాబోతుంది అంటూ హంగామా మొదలు పెట్టారు. తారక్ అన్న సినిమా అప్ డేట్ వచ్చేస్తుంది అసలు తారక్ అన్న సినిమా నుండి అప్ డేట్ వచ్చినా, రాకపోయినా మేము ట్రెండ్ చేస్తూనే ఉంటామంటూ ఎన్టీఆర్ ఫాన్స్ గోల గోల చేస్తున్నారు .

అలాగే ఈ సినిమాలో తారక్ సరసన రష్మిక మందన్న కన్ ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ చెప్పేసుకుంటున్నారు. మరోపక్క మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నారని, కొరటాల ప్రస్తుతం ఆయన్ని ఒప్పించే పనిలో ఉన్నాడంటున్నారు. అంతేకాకుండా NTR30 మాస్ లోడింగ్, ఎన్టీఆర్ 30 అప్ డేట్ సూన్, ఎన్టీఆర్ 30 పూజ అక్టోబర్ పది నే అంటూ హాష్ టాగ్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఫాన్స్ వెయిటింగ్ కి శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

NTR30 hashtag trends on twitter:

NTR30 update soon

Tags:   NTR30, TARAK, JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ