విజయ్ దేవరకొండ - రష్మిక ఇద్దరూ మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటారు. కానీ వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టుగా అప్పుడప్పుడు హడావిడి చేస్తారు. అటు విజయ్ ని ఇటు రశ్మిక కానీ ఎక్కడికెళ్లినా మీడియా వారు అదే ప్రశ్నిస్తారు. మీ మధ్యన ఏదో ఉందట కదా అని. రష్మిక మాత్రం ఇలాంటి వార్తలు చూస్తుంటే నవ్వొస్తుంది అంటుంది. అయితే ఒకసారి న్యూ ఇయర్ అప్పుడు వెకేషన్స్ కోసం విజయ్ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రష్మిక అందరూ కలిసి గోవా వెళ్లారు. తర్వాత విజయ్ లైగర్ కోసం ముంబైలో ఉండగా రష్మిక బాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ కోసం ముంబైలోనే ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి సీక్రెట్ డిన్నర్స్ కి వెళ్లేవారు. అయితే తాజాగా విజయ్ నటించిన లైగర్ డిసాస్టర్ అవ్వగా.. రష్మిక మాత్రం నాకు బాగా నచ్చింది అంటూ కామెంట్ చేసి అందరికి షాకిచ్చింది. నాకు మాస్ నచ్చుతుంది. అందుకే లైగర్ నచ్చింది అంది.
విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత ఖుషి షూటింగ్ లో ఇంకా పాల్గొనడం లేదు. జిమ్ లో కొవ్వు కరిగిస్తున్నాడు. సమంత అందుబాటలో లేకపోవడంతో విజయ్ కూడా ఖాళీగా ఉన్నాడు. రష్మిక నటించిన బాలీవుడ్ మూవీ ఈ రోజే గుడ్ బై మూవీ రిలీజ్ అయ్యింది. నిన్నటివరకు ప్రమోషన్స్ లో బిజీగా గడిపిన రష్మిక నేడు ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించేసరికి. విజయ్-రష్మిక ఇద్దరూ మాల్దీవులకు వెకేషన్స్ కి వెళ్లారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి విజయ్-రష్మిక మాల్దీవులకు వెళితే నిజంగా వారు మధ్యనే సం థింగ్ సం థింగ్ ఉంది అంటున్నారు. మళ్ళీ ఈ విషయమై వాళ్లెలా స్పందిస్తారో చూడాలి.