మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా రోజున విడుదలై అద్భుతమైన టాక్ తో ఆడియన్స్ ని మెప్పించింది. ఆడియన్స్ మాత్రమే కాదు, క్రిటిక్స్ కూడా గాడ్ ఫాదర్ కి మంచి రేటింగ్స్ ఇవ్వడంతో మెగా కాంపౌండ్ లో జోష్ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ అయ్యాక గాడ్ ఫాదర్ తోనే మంచి హిట్ కొట్టారు. ఖైదీ నెంబర్ 150 సో సో హిట్ కాగా.. సైరా కూడా హిట్ లిస్ట్ లోకి వెళ్లినా అంత చెప్పుకోదగిన హిట్ కాదు, ఇక ఆచార్య డిసాస్టర్ గురించి చెప్పక్కర్లేదు. సో చిరు కమ్ బ్యాక్ తర్వాత చిరు మంచి హిట్ కొట్టింది గాడ్ ఫాదర్ తోనే. ఇక చిరు మరో రెండు మూవీస్ సెట్స్ మీదున్నాయి. అందులో మెగా 154 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది.
అటు మెహర్ రమేష్ కూడా భోళా శంకర్ షూటింగ్ ని కూడా ఉరుకులు పెట్టిస్తున్నారు. బాబీ దర్శత్వంలో రాబోతున్న మెగా 154 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్టుగా ఎనౌన్స్ చేసేసారు. దానితో దివాళి నుండే మెగా 154 ప్రమోషన్స్ స్టార్ట్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నారంటున్నారు. ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్స్ తో బాబీ చాలా స్పీడుగా ఉన్నాడు. ఇక దివాళికి మాస్ టైటిల్ తో పాటుగా టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. మెగా 154 టైటిల్ గా వాల్తేర్ వీరయ్య బయటకి వచ్చినా దానిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దివాళికి టైటిల్ తో పాటుగా ఊర మాస్ టీజర్ రిలీజ్ కి ఏర్పాట్లు చేస్తున్నాడట బాబీ. మరి మెగా ఫాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తూ మెగాస్టార్ జోష్ చూపిస్తున్నారు.