బిగ్ బాస్ నుండి గత వారం ఆరోహి వెళ్ళాక సూర్యకి కనెక్ట్ అయ్యింది ఇనాయ. ఆరోహి-సూర్యకు బయట మంచి ఫ్రెండ్స్. కానీ బిగ్ బాస్ లో ఫుటేజ్ రావడం కోసం క్లోజ్ గా మూవీ అవుతూ హగ్గులు, కిస్సులు ఇలా చేసేవారు. వాళ్ళిద్దరికి మధ్యన ఎమన్నా ప్రేమ ఉందేమో అంటూ చాలామంది అనుకున్నారు. కేవలం ఆరోహిని అందుకే ఓట్స్ వెయ్యకుండా బుల్లితెర ప్రేక్షకులు ఎలిమినేట్ చేసారని అన్నారు. ఆమె బయటికి వచ్చాక అదే ప్రశ్నలు ఎదురయ్యాయి. అలా ఉంటే ఆరోహి వెళ్ళాక ఇనాయ సూర్యకి దగ్గరవుతూ హగ్గులు ఇస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో సూర్య అంటే ఇష్టం, అతను ఆరోహితో క్లోజ్ గా ఉంటే జెలస్ ఫీలయ్యేదాన్ని అంది.
అదలా ఉంటే ఈ వారం కెప్టెన్సీ పోటీలో రేవంత్, బాలాదిత్య, సూర్యలు హౌస్ మద్దతు కూడగట్టుకోవాల్సి వచ్చింది. దానిలో భాగంగా చాలామంది రేవంత్ ఫైర్ బావుంది, కోపం తగ్గించుకుంటే సూపర్, కెప్టెన్ అయితే కోపం తగ్గించుకుంటాడేమో అన్నారు, శ్రీసత్య లాంటి వాళ్ళు రేవంత్ కోపం తగ్గించుకున్నాక కెప్టెన్ అయితే బావుంటుంది అన్నారు. చాలావరకు రేవంత్ నే సపోర్ట్ చేసినట్టుగా లేటెస్ట్ ప్రోమోలో కనిపిస్తుంది. మరోపక్క ఇనాయ సూర్యకి సపోర్ట్ చేస్తున్నట్టుగా దండ వెయ్యబోయి.. సుర్యకి హ్యాండ్ ఇచ్చి రేవంత్ కి సపోర్ట్ చేస్తూ దండ వేసింది.. తర్వాత సూర్యకి హగ్గు ఇవ్వగా.. హగ్గు నాకు దండ రేవంత్ కా అంటూ సూర్య తెల్లబోయాడు.. ఈ వారం అందరి మద్దతుతో రేవంత్ కెప్టెన్ గా నిలిచినట్టుగా తెలుస్తుంది.