బాలకృష్ణ NBK 107 షూటింగ్ కి కొద్దిగా విరామం ఇచ్చి ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్2 షూటింగ్ లో బిజీ అయ్యారు. ఇప్పటికే బావ చంద్రబాబు తో మొదటి ఎపిసోడ్ ని పూర్తి చెయ్యడమే కాదు, టీజర్ లాంచ్ కోసం బాలయ్య విజయవాడకి వెళ్లారు. అయితే ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్2 సీజన్ లో చాలా మెరుపులు మెరవబోతున్నాయి. సీజన్ 1 లో బాలయ్యకి గెస్ట్ గా మహేష్ రావడం ఫాన్స్ కి కిక్ ఇవ్వగా.. సీజన్ 2 కి చంద్రబాబు హాజరవడం ఓ క్రేజీ న్యూస్ అయితే.. మెగాస్టార్ ఈ సీజన్2 లో గెస్ట్ గా రాబోతున్నారు. అది కూడా దివాళి ఎపిసోడ్ కి మెగాస్టార్ బాలయ్య టాక్ షో కి గెస్ట్ అంటున్నారు.
మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి రాబోతున్నారనే న్యూస్ వినిపిస్తుంది. అయితే గత సీజన్ ని మహేష్ బాబు ఎపిసోడ్ తో ఎండ్ చేసినట్టుగా ఈ ఎపిసోడ్ ని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఎండ్ చేసే ఆలోచనతో ఆహా టీం ఉందట. మరి బాలకృష్ణ టాక్ షో లో మెగా బ్రదర్స్ అంటే మాములు క్రేజ్ కాదు, ఆ ఎపిసోడ్స్ పై అంచనాలు ఆకాశంలో ఉండడం ఖాయం. బాలయ్య వేసే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి చిరు, పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.