నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘NBK107’ చిత్రానికి సంబంధించి ఇప్పుడొక వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను టర్కీలో ముగించుకున్న విషయం తెలిసిందే. టర్కీ నుండి ఇటీవలే టీమ్ భారత్‌కు వచ్చారు. బాలయ్య మరోవైపు ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’ ప్రమోషన్స్‌లో కూడా విరివిగా పాల్గొంటున్నారు. అయితే ఇప్పటి వరకు NBK107 సినిమాని డిశంబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతి బరిలోకి దింపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఏ విధంగా వర్కవుట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమాని మేకర్స్ సంక్రాంతి బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు. బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ హంట్ వీడియో, ఆపై మాస్ పోస్టర్.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. కచ్చితంగా మరో బ్లాక్‌బస్టర్ విజయం బాలయ్య ఖాతాలో పడబోతున్నట్లుగా మాట్లాడుకునేలా అవి చేశాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి బరిలో.. అంటే.. బాలయ్యకు బంపర్ హిట్ ఖాయం.