ఆదిపురుష్ టీజర్ రిలీజ్ కాగానే సర్వత్రా విమర్శలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. విశేషమేమిటంటే ఇటు సినిమా రంగం నుండే కాక అటు రాజకీయరంగం నుండి కూడా ఆదిపురుష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు వినిపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇది మొబైల్స్, లాప్ టాప్స్ లో చూసే సినిమా కాదంటూ ఆదిపురుష్ ఇవ్వనున్న 3D బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ని ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశ్యంతో.. ఆ చిత్ర 3D టీజర్ ని స్క్రీనింగ్ కి సిద్ధం చేసింది యూనిట్. నేడు హైదరాబాద్ AMB మాల్ లో మీడియా ముందు ఆదిపురుష్ 3D స్క్రీనింగ్ జరిగింది. ఇదే టీజర్ ని నార్మల్ గా చూసి పెదవి విరిచిన మీడియా వాళ్ళు కూడా 3D లో చూసి ఆ అనుభూతుని పొందాక.. దాన్ని ఆస్వాదించాక థియేటర్స్ లో చప్పట్లు కొట్టడం విశేషం.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ 3D ఫస్ట్ టైం చూసినప్పుడు పసిపిల్లాడిలా ఫీలయ్యాను, చాలా గమ్మత్తుగా ఫీలయ్యాను. మళ్లీ మళ్లీ చూసాను. ఇప్పుడు ఖచ్చితంగా మీ అందరి స్పందన చూసాక నాకు అర్ధమైంది అదే. ఇది 3D లో చూడాల్సిన సినిమా. బిగ్ స్క్రీన్ మీద మాత్రమే ఎక్స్ పీరియన్స్ చెయ్యాల్సిన సినిమా. ఖచ్చితంగా మీరందరూ అలా చూస్తారని, ఆదిపురుష్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారని ఆశిస్తాను అని అన్నారు.
దిల్ రాజు మట్లాడుతూ.. నేను ఆదిపురుష్ 3D టీజర్ చూడగానే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ప్రభాస్ కి కాల్ ట్రై చేశాను. తన ఫోన్ స్విచ్ అఫ్ వచ్చింది. వెంటనే మెసేజ్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడికి మళ్లీ చూడడానికే వచ్చాను.బాహుబలి రిలీజ్ అయిన మొటిరోజున కూడా కొంత నెగెటివ్ రియాక్షన్ కనిపించింది. కొన్ని కామెంట్స్ వినిపించాయి. నేను అప్పుడు ప్రభాస్ కి చెప్పాను. ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యుజ్ హిట్ అని. మళ్లీ ప్రభాస్ కి చెబుతున్నాను ఆదిపురుష్ అనేది మాములు సినిమా కాదు, డెఫనెట్ గా హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవుతుంది అన్నారు ఆయన.