Advertisementt

బ్రదర్ ఆపాటి దానికి ఈపాటి సెటైర్.?

Thu 06th Oct 2022 08:55 PM
nagababu,garikipati narasimha rao,chiranjeevi  బ్రదర్ ఆపాటి దానికి ఈపాటి సెటైర్.?
Nagababu Strong Counter to Garikipati బ్రదర్ ఆపాటి దానికి ఈపాటి సెటైర్.?
Advertisement
Ads by CJ

హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ కూతరు, బీజేపీ నేత విజ‌య‌ల‌క్ష్మి దసరా స్పెషల్ గా గురువారం హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు చాలామంది పోటీపడ్డారు. గాడ్ ఫాదర్ గా హిట్ అందుకున్న చిరంజీవి అంటే ఫాన్స్ కి భీభత్సమైన క్రేజ్. చిరు తో సెల్ఫీ లకి పోటీ పడి కార్యక్రమాన్ని స్పాయిల్ చెయ్యడంతో అక్కడే వేదికపై ప్రవచనాలు చెబుతున్న గరికపాటి చిరంజీవిపై అసహనం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

అయితే చిరు పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన గ‌రిక‌పాటి న‌ర‌సింహారావుపై మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు సోష‌ల్ మీడియాలో స్పందించారు. గ‌రిక‌పాటిపై ఇండైరెక్ట్ గా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే.. అంటూ నాగ‌బాబు గరికపాటికి ఉద్దేశించి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. చిరంజీవి ఇమేజ్ ని చూసి అసూయ పడుతున్న గరికపాటి అనకుండా పరిపాటే అంటూ సెటైర్ వేశారు నాగబాబు. బ్రదర్ ఆపాటి దానికి ఈపాటి సెటైర్.. వుండాలిసిందే అంటున్నారు మెగా ఫాన్స్.

Nagababu Strong Counter to Garikipati :

Nagababu Strong Counter to Garikipati Narasimha Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ