Advertisementt

ఆదిపురుష్ పై కాపీ విమర్శలు

Thu 06th Oct 2022 05:21 PM
adipurush,prabhas,om rauth  ఆదిపురుష్ పై కాపీ విమర్శలు
Vanar Sena Animation studio alleged Adipurush poster copied ఆదిపురుష్ పై కాపీ విమర్శలు
Advertisement
Ads by CJ

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్ వచ్చేవరకు ప్రభాస్ ఫాన్స్ చాలా ఆత్రుత పడ్డారు. సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీ పెరిగిపోయింది ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ మినీ యుద్ధమే చేసారు. కానీ ఆదిపురుష్ టీజర్ బయటికి వచ్చాక ఆ ఆత్రుత, అంచనాలు ఆవిరైపోయాయి. ఆదిపురుష్ టీజర్ పై వచ్చిన ట్రోల్స్ కానివ్వండి, నెగెటివిటి కానివ్వండి అన్ని టీమ్ ని, ప్రభాస్ ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేసేసింది. ఆదిపురుష్ ని బ్యాన్ చెయ్యాలంటూ నెటిజెన్స్ కూడా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ఆదిపురుష్ పై మరో విమర్శ మొదలయ్యింది. అది కాపీ వివాదం. ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ చూసిన ప్రముఖ యానిమేషన్ సంస్థ కాపీ విమర్శలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. వానర సేన యానిమేటెడ్ సంస్థ తమ పోస్టర్ ని కాపీ కొట్టారంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రభాస్ పోస్టర్ ని షేర్ చేస్తూ వానర సేన స్టూడియోస్ సంస్థ రూపించిన పోస్టర్ ని షేర్ చేసింది. ఈ పోస్టర్ పై ఎలాంటి కంప్లైంట్ చెయ్యము అన్న ఆ సంస్థ.. ఎంత అవమానకరం.. T సీరీస్ కి ఆర్ట్ వర్క్ ని అభివృద్ధి చేసింది ఎవరో చెప్పాలంటూ క్యాప్షన్ పెట్టింది. దానితో ఇప్పుడు ఆదిపురుష్ పై కాపీ వివాదం మొదలైంది.

Vanar Sena Animation studio alleged Adipurush poster copied:

Adipurush poster copied

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ