మలయాళ హిట్ ఫిలిం లూసిఫర్ ని మెగాస్టార్ చిరు తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. మోహన్ రాజా లూసిఫర్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారనుకుంటే.. ఆయన అన్ని భాషల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లూసిఫెర్ ఒరిజినల్ లో భారీ మార్పులు చేసారు. జస్ట్ మెయిన్ స్టోరీ తీసుకుని ఆయన కథని అందులోని పాత్రలని మార్చేశారు. గాడ్ ఫాదర్ విడుదలకు ముందు లూసిఫెర్ కథ ని తీసుకుని జస్ట్ నటులని చేంజ్ చేశారనుకున్నారు. అంటే మోహన్ లాల్ పాత్రలో చిరు, పృథి రాజ్ పాత్రలో సల్మాన్, మంజు వారియర్ కేరెక్టర్ లో నయన్ అని.
కానీ ఇక్కడ స్టోరీలో మార్పులు చేసారు దర్శకుడు అంటే చిరు సిస్టర్ గా నయన్ కనబడింది, బాడీ గార్డ్ గా సల్మాన్ ఇదంతా ఓకె. అక్కడ మంజు వారియర్ కూతురుని వివేక్ ఒబెరాయ్ హెరాస్ చేస్తే.. ఇక్కడ నయన్ కూతురు లేకుండా చెల్లెలిని సత్యదేవ్ హెరాస్ చేసినట్లుగా చూపించడం, మోహన్ లాల్ స్టెప్ బ్రదర్ గా థోమినో థామస్ కనబడితే.. ఇక్కడ అసలు చిరుకి బ్రదర్ లేడు. ఇలాంటి మార్పులు గాడ్ ఫాదర్ లో కనిపించడంతోనే చిరుకి సక్సెస్ దక్కింది. లేదంటే లూసిఫెర్ ని చూసాక గాడ్ ఫాదర్ ని చూసి నిట్టూర్చేవారు.