Advertisementt

మహేష్ ని అలా చూపిస్తున్న త్రివిక్రమ్

Thu 06th Oct 2022 10:46 AM
ssmb28,mahesh babu,trivikram  మహేష్ ని అలా చూపిస్తున్న త్రివిక్రమ్
SSMB28: Mahesh character revealed మహేష్ ని అలా చూపిస్తున్న త్రివిక్రమ్
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోలని చాలా స్టయిల్ గా చూపిస్తూ ఉంటారు. అలాగే కథ కూడా డబ్బు చుట్టూ తిరిగేలా రాసుకుంటారు. కథ మాస్ గా ఉన్నప్పటికీ హీరో స్టయిల్ గానే ఉంటాడు. అరవింద సమేతలో ఎన్టీఆర్ క్లాస్ గానే కనిపిస్తాడు. కథ రాయలసీమ, ఫ్యాక్షనిస్ట్ చుట్టూ తిరిగినప్పటికీ ఎన్టీఆర్ క్లాసీ లుక్స్ లోనే కనిపించాడు. ఇక అలా వైకుంఠపురములో కూడా అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ అయినా కేరెక్టర్ కి క్లాస్ టచ్ ఇచ్చారు. ఇప్పుడు మహేష్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే మూవీ భారీ బడ్జెట్ తో, క్లాస్ ఎంటర్టైనర్ లా ఉండబోతుంది అని తెలుస్తుంది.

మహేష్ బాబు ని డీసెంట్ లుక్స్ లో సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. గత నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లి ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసాక మహేష్ బాబు గారి త్లలి కాలం చేసింది. ఇక రెండో షెడ్యూల్ అక్టోబర్ 10 తర్వాత మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజ హెగ్డే కూడా జాయిన్ అవుతుంది అని, మహేష్-పూజ హెగ్డే పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట. అలాగే ఈ ఎపిసోడ్ పూర్తిగా ఫ్యామిలీ సన్నివేశాలకి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

SSMB28: Mahesh character revealed:

SSMB28: Interesting news on Mahesh character 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ