విజయదశమికి స్టార్ హీరోలు సైలెంటయ్యారు. ప్రతి పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీలోని చిన్న, పెద్ద హీరోలు తమ సినిమాల లుక్స్‌ని కానీ, టీజర్ కానీ రిలీజ్ చేస్తూ హంగామా చేస్తారు. చిన్న సినిమా దగ్గర నుండి, భారీ బడ్జెట్ సినిమా వరకు వదిలే పోస్టర్స్‌తో టాలీవుడ్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ పండగ కళ కనిపిస్తుంది. అయితే ఈసారి విజయదశమికి ఇద్దరు సీనియర్ హీరోలు గట్టిగా పోటీ పడ్డారు. చిరు-నాగార్జునలు ఇద్దరూ తగ్గేదే లే అంటూ పోటాపోటీగా సినిమాలు విడుదల చేశారు. మరోపక్క చిన్న, మీడియం బడ్జెట్ మూవీస్ పోస్టర్స్ కుప్పలు తెప్పలుగా దసరా శుభాకాంక్షలతో వచ్చిపడ్డాయి.
కానీ ఈసారి స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు సైలెంట్‌గా ఉన్నారు. ప్రభాస్ రెండు రోజుల ముందే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశాడు. ఇక RC15 షూటింగ్ చాలావరకు పెండింగ్ ఉండడంతో ఆ సినిమా లుక్ కానీ, టైటిల్ కానీ శంకర్ వదలడం లేదు. మరోపక్క మహేష్ బాబు దసరా మూడ్‌లో లేడు. వాళ్ల అమ్మ ఈమధ్యనే మృతిచెందారు. ఇక ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలు పెట్టలేదు. కనీసం అప్‌డేట్ ఇవ్వలేదు. గత రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వర్క్ షాప్ అంటూ హడావిడి చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 2 రెగ్యులర్ షూట్ మొదలెట్టలేదు. అందుకే ఈ హీరోలెవరూ ఈ దసరాకి సందడి చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు.