బాలీవుడ్ సినిమాలకి వస్తున్న నెగిటివిటీని ఇప్పుడు ‘ఆదిపురుష్’ కూడా ఫేస్ చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని కూడా నెటిజెన్స్ వదలకుండా బాయ్ కాట్ హాష్ టాగ్స్‌ని ట్రెండ్ చేస్తున్నారు. టీజర్ విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఆదిపురుష్‌పై వచ్చే ట్రోల్స్ చూస్తే ఓం రౌత్ ఇక అంతే. ఆదిపురుష్ ఫ్యాన్‌మేడ్ పోస్టర్స్‌తో ఫన్నీ గేమ్ ఆడిన ఓం రౌత్‌కి ఈ రకమైన నెగెటివిటీని తట్టుకోవడం మాములు విషయం కాదు. ఎన్టీఆర్ వంటి నటుడిని రావణుడిగా చూసిన వాళ్ళకి సైఫ్ అలీ ఖాన్‌ని ఆ పాత్రలో చూడలేకపోతున్నారు. ఎన్టీఆర్‌ని చూసి నేర్చుకోండి అంటూ చాలామంది ఆదిపురుష్ టీమ్‌పై ఫైర్ అవుతున్నారు.
మరోపక్క బిజెపి వాళ్ళు కూడా ‘ఆదిపురుష్’ని విమర్శిస్తున్నారు. భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌పై ఇంత భారీ ట్రోలింగ్ జరగడంతో టీమ్ అప్‌సెట్ అయ్యింది అంటున్నారు. మరోపక్క ‘నేను మొబైల్ స్క్రీన్స్ కోసం ఆదిపురుష్ చెయ్యలేదు.. 3D ఎఫెక్ట్స్‌తో చేశాను’ అంటూ ఆదిపురుష్ టీజర్‌పై వస్తున్న ట్రోల్స్‌కి ఓం రౌత్ సమాధానం చెబుతున్నా సోషల్ మీడియాలో నెగెటివిటీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇదంతా ఫేస్ చేయలేక ఆదిపురుష్ టీమ్ టెన్షన్ పడుతుందట.