గత నెలలో దేవి నవరాత్రులు మొదలయ్యాయి.. ఈరోజు దసరా విజయదశమితో నవరాత్రులు పూర్తయ్యాయి కూడా. కానీ ఎన్టీఆర్ తదుపరి సినిమా అప్ డేట్ రాలేదు. గత రెండు రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ NTR30 అప్ డేట్ ఈ రోజు విజయదశమి రోజున వస్తుంది అంటూ నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా దసరాకి NTR30 అప్ డేట్ ఇస్తారనే నమ్మారు. కొరటాలతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడం ఫాన్స్‌కి మాత్రం నిరాశగానే ఉంది.
దసరా పండగ చాలా చప్పగా గడిచింది, దసరా వచ్చింది, వెళ్ళింది.. కానీ మా అన్న ఎన్టీఆర్ మాత్రం అప్‌డేట్ ఇవ్వకుండా మమ్మల్ని ఇంకా వెయిట్ చేయిస్తున్నాడు అంటూ ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో NTR30 అప్‌డేట్ కోసం ఫాన్స్ యుద్ధమే చేస్తున్నారు. కానీ కొరటాల నుండి కానీ, ఎన్టీఆర్ నుండి కానీ ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఈ రోజు పండగ ఉత్సాహాన్ని NTR30 మేకర్స్ నీరు కార్చేశారంటూ తెగ ఫీలైపోతున్నారు.