సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నప్పటికీ కూతుళ్లు డెసిషన్ మీద ఆయన మధనపడుతున్నారనే వార్తలు కోలీవుడ్ సర్కిల్స్ లో ఎప్పటినుండో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సౌందర్య మొదటి భర్తకి విడాకులిచ్చి.. ఒక కొడుకు ఉండగానే మరొక పెళ్లి చేసుకుంది. అదలా ఉంటే పెళ్లి చేసుకున్న 18 ఏళ్ళ తర్వాత రజినీకాంత్ మరో కూతురు ఐశ్వర్య స్టార్ హీరో ధనుష్ తమ వివాహబంధానికి విడాకుల పేరుపెట్టి విడిపోయారు. దానితో ధనుష్ ఫాన్స్ మాత్రమే కాదు, రజినీకాంత్ అభిమానులు కూడా బాగా బాధపడ్డారు. ఈ విషయంలో రజినీకాంత్ మౌనం వహించారు. అయితే మధ్యలో ధనుష్-ఐశ్వర్యలకు పెద్దలు నచ్చ జెప్పుతున్నారనే టాక్ నడిచింది. ధనుష్-ఐశ్వర్య కలిసిపోయారని అని కూడా అన్నారు.
కానీ అదేం లేదు అన్నట్టుగా ధనుష్-ఐశ్వర్యాలు విడివిడిగానే ఉన్నారు. అయితే కొద్దికాలంగా రజినీకాంత్ ఐశ్వర్యకి ధనుష్ కి నచ్చజెప్పుతున్నారని, రజినీకాంత్ ప్రయత్నాలు ఫలించి ఐశ్వర్య-ధనుష్ లు విడాకుల విషయంలో వెనక్కి తగ్గుతున్నారనే టాక్ మొదలయ్యింది. పెద్దల మాటలను గౌరవించి వారిద్దరు కలిసిపోయేందుకు నిర్ణయించుకున్నారనే టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. అయితే అసలు ధనుష్ కానీ, ఐశ్వర్య కానీ ఇంతవరకు విడాకుల కోసం అప్లై చెయ్యలేదని తెలుస్తుంది. అందుకే వీరు ఇప్పుడు కలవడం ఈజీ అయ్యింది అంటున్నారు. అయితే ధనుష్-ఐశ్వర్య కలసిపోయారనేది మీడియాలో వినిపిస్తున్న టాకే కానీ, ఇంతవరకు అయితే అఫీషియల్ ప్రకటన రాలేదు.