అల్లు రామలింగయ్య 100 వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోని ఓపెనింగ్ చెయ్యడమే కాదు.. అదే రోజు సాయంత్రం అల్లు రామలింగయ్య బుక్ లాంచ్ ని ఫ్యామిలీ మెంబెర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. అల్లు అరవింద్ ఆయన ఇద్దరు చెల్లెళ్లు, చెల్లెళ్ళ ఫామిలీస్, మనవలు, మనవరాళ్లు అంతా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆఖరికి అల్లు రామలింగయ్య భార్యగారు కూడా 92 ఏళ్ళ వయసులో ఆమె ఆ స్టేజ్ పై కనిపించారు. ఇక అల్లు అరవింద్ తాజాగా అలీ తో సరదాగా ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. ఆ షో లో అలీ అల్లు అరవింద్ తో చాలా విషయాలు పంచుకున్నారు. తన మనవడికన్నా మనవరాలు అర్హ చాలా తెలివైంది అని, అంత తెలివైన పిల్లలు చాలా అరుదు.. కానీ మనవరాలు గురించి ఎక్కువగా చెప్పకూడదని అన్నారాయన. అలాగే మీరు హీరోగా కాకుండా నిర్మాతగా ఎందుకు మారారు అని అలీ అడిగాడు.
దానికి అల్లు అరవింద్ చాలా క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. Employer అవుదామనుకున్నాను కానీ, Employee అవుదామనుకోలేదు అందుకే ఇలా అన్నారాయన. తర్వాత అల్లు అరవింద్ ని అలీ కాంట్రవర్సీగా ఓ ప్రశ్న అడిగాడు. అరవింద్ గారి ఫ్యామిలీకి చిరంజీవిగారి ఫ్యామిలీకి కొన్ని డిస్టబెన్సెస్ వచ్చాయట కదా అని అడగ్గానే.. అరవింద్ మీరు కాంట్రవర్సీల ప్రశ్నలు ఉంటే ముందే చెప్పమని అడిగితే కాంట్రవర్సీ ఏమి లేదు.. సర్ ప్రయిజింగ్ ప్రశ్నలున్నాయన్నారు. ఆ సర్ ప్రైజ్ ప్రశ్న ఇదేనా అంటూ అలీ మీద అరవింద్ ఫైర్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.