Advertisementt

ఓటిటి లోకి వచ్చేసిన కార్తికేయ 2

Wed 05th Oct 2022 01:53 PM
karthikeya 2,zee 5,nikhil  ఓటిటి లోకి వచ్చేసిన కార్తికేయ 2
Karthikeya 2 now streaming ఓటిటి లోకి వచ్చేసిన కార్తికేయ 2
Advertisement

ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని థియేటర్స్ లో మిస్ అయిన వారంతా నిఖిల్ కార్తికేయ 2 కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. థియేటర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, హిందీ ఆడియన్స్ ని మెప్పించిన కార్తికేయ 2 ఓటిటిలోకి రావడానికి 50 రోజులు పైనే పట్టింది. ఆగష్టు 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 120 కోట్లు కొల్లగొట్టి నిఖిల్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది కార్తికేయ 2. చందు మొండేటి మేకింగ్, నిఖిల్ నటన, కార్తికేయ 2 కథ ఆడియన్స్ ని మెప్పించడం సూపర్ సక్సెస్ అయ్యాయి.

అయితే థియేటర్స్ లో ఇంత పెద్ద హిట్ అయిన ఈ మూవీకి విమర్శకుల సైతం క్లాప్స్ కొటారు. అలాంటి మూవీని బిగ్ స్క్రీన్ పైన మిస్ అయిన ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద చూసేందుకు ఆత్రుత చూపించారు. ఇక నేడు దసరా సందర్భంగా కార్తికేయ 2 జీ 5 ఓటిటి వేదికగా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద ఎలాంటి రికార్డ్ లని క్రియేట్ చేస్తుందో చూడాలి.

Karthikeya 2 now streaming:

Karthikeya 2 now streaming on Zee 5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement