ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ సినిమా రిలీజ్ కాకముందే కృతి శెట్టి కి టాలీవుడ్ లో వరసగా ఆఫర్స్ వచ్చాయి. యంగ్ హీరోలైన నాని, రామ్, నితిన్, సుధీర్ బాబు, నాగ చైతన్య ఇలా వరస సినిమాలతో బిజీ అయ్యింది. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత ఆమె లక్ మరింతగా పెరిగింది. నాని శ్యామ్ సింగ రాయ్, నాగ చైతన్య బంగార్రాజు తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది కూడా. ఇప్పుడు ఇదే పొజిషన్ మరో కుర్ర బ్యూటీలో కనిపిస్తుంది. అదే పెళ్ళిసందడి హీరోయిన్ శ్రీలీల. పెళ్ళిసందడి నిరాశపరిచినప్పటికీ.. ఆమెకి టాలీవుడ్ లో వరసగా ఆఫర్స్ తలుపు తడుతున్నాయి కాదు వచ్చేసాయి. ఇప్పటికే రవితేజ తో ఢమాకాలో నటించేసింది. అలాగే బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో శ్రీలీలే హీరోయిన్.
ఇప్పుడు రామ్ చెయ్యబోయే పాన్ ఇండియా మూవీలోనూ శ్రీలీలని హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. బోయపాటి-రామ్ కాంబోలో RAPO20 గా తెరకెక్కబోతున్న పాన్ ఇండియా ఫిలిం లో రామ్ కి జోడిగా శ్రీలీల ని ఎంపిక చేసినట్లుగా మేకర్స్ దసరా రోజు ప్రకటించారు. పెళ్లిసందడిలో క్యూట్ గా రొమాంటిక్ గా, అణుకువగా ఆకట్టుకున్న శ్రీలీల కి టాలీవుడ్ కుర్ర హీరోలు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు శ్రీలీల ఏకంగా రామ్ తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇదంతా చూస్తుంటే శ్రీలీల కి లక్కు మాములుగా లేదు అనిపించకమానదు. కృతి శెట్టి లాగే శ్రీలీల కూడా యంగ్ హీరోలందరిని చుట్టేసేలా కనబడుతుంది.