రణబీర్ కపూర్-అలియా భట్ కలయికలో నాగార్జున, అమితాబ్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యింది. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రని మూడు పార్టులుగా తెరకెక్కించనున్నారు. మొదటి పార్ట్ గత నెలలో విడుదలై డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కథే లేదు అంటూ ఆడియన్స్ తేల్చేసారు. కానీ బ్రహ్మాస్త్రకి కలెక్షన్స్ పరంగా రోజు రోజుకి మంచి నెంబర్లు నోట్ చేసింది. బ్రహ్మాస్త్ర తో బాలీవుడ్ కి మరో పరాభవం అన్నారు. కలెక్షన్స్ పరంగా దూసుకుపోయినా.. ఆ కలెక్షన్స్ విషయంలో కొద్దిగా గందరగోళం నెలకొంది.
తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా పై, కలెక్షన్స్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇన్స్టా వేదికగా స్పందించాడు. 2022 లో ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ గా నిలిచిన హిందీ మూవీ బ్రహ్మాస్త్ర. సినిమాని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అంటూ హ్యాపీ నవమి విషెస్ చెప్పిన అయాన్ ముఖర్జీ, బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసాడు. ఆ పోస్టర్ లో బ్రహ్మాస్త్ర 25 రోజుల్లో 425 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా చెప్పాడు, భూల్ భూలయ్య, కాశ్మీరీ ఫైల్స్ కన్నా బ్రహ్మాస్త్ర ఎక్కువ కలెక్షన్స్ రాబట్టినట్టుగా అయాన్ ముఖర్జీ ఇన్స్టాలో రాసుకొచ్చాడు.