Advertisementt

పవన్ కళ్యాణ్ కి మద్దతుపై చిరు రియాక్షన్

Tue 04th Oct 2022 02:34 PM
megastar chiranjeevi,pawan kalyan,janasena  పవన్ కళ్యాణ్ కి మద్దతుపై చిరు రియాక్షన్
Chiranjeevi reacts on his support to JanaSena Party పవన్ కళ్యాణ్ కి మద్దతుపై చిరు రియాక్షన్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ కి రెడీ అయ్యింది. దసరా స్పెషల్ గా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా టీం మొత్తం ఈ రోజు మీడియా మీట్ నిర్వహించారు. ఈ మీట్ లో మెగాస్టార్ చివరంజీవికి గాడ్ ఫాదర్ కి సంబందించిన ప్రశ్నలే కాదు, ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు మద్దతునిచ్చే ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అంతేకాకుండా ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అంటూ చిరంజీవిని ప్రశ్నించారు మీడియా వారు.

వీటన్నిటికీ మెగాస్టార్ తనదైన శైలిలో ఆన్సర్స్ ఇచ్చారు. మీరు మీ తమ్ముడు పవన్ కి ఆయన పార్టీ జనసేనకు మద్దతునిస్తారా అని అడగగా.. దానికి పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తులో మద్దతునిస్తానేమో.. పవన్ లాంటి నిబద్దత ఉన్న నాయకుడు మనకి రావాలి, పవన్ కి రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇవ్వొచ్చు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. నా ఆకాంక్ష అదే.. పవన్ కి నా మద్దతు ఉంటుంది. నా తమ్ముడి నిబద్దత, నిజాయితీ నాకు తెలుసు. మేము చెరో వైపు ఉండడం కంటే నేను తప్పుకోవడమే తనకి హెల్ప్ అవుతుందేమో అంటూ చిరు రాజకీయాలపై స్పష్టమైన మాటలు మట్లాడారు. అంటే ఇకపై చిరంజీవి కాంగ్రెస్ లో ఉండకపోవచ్చు అనే ప్రశ్నకి కూడా చిరు ఇలా క్లారిటీ ఇచ్చినట్టే కనిపిస్తుంది.

Chiranjeevi reacts on his support to JanaSena Party:

Megastar Chiranjeevi reaction on Pawan Kalyan support

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ