Advertisementt

ఆ సినిమా ప్లాప్, నిద్రలో ఏడ్చేదాన్ని: రష్మిక

Tue 04th Oct 2022 12:56 PM
rashmika mandanna,vijay deverakonda,dear comrade  ఆ సినిమా ప్లాప్, నిద్రలో ఏడ్చేదాన్ని: రష్మిక
Rashmika says she had nightmares after painful trolling ఆ సినిమా ప్లాప్, నిద్రలో ఏడ్చేదాన్ని: రష్మిక
Advertisement
Ads by CJ

రశ్మిక టాలీవుడ్ విజయ్ దేవరకొండ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న గీత గోవిందం ఎంతటి బ్లాక్ బస్టర్ ఇచ్చిందో.. విజయ్ తో జత కట్టిన డియర్ కామ్రేడ్ అంత నిరాశ పరిచింది. ఆ సినిమాలో విజయ్ తో లిప్ లాక్ తో హైలెట్ అయ్యింది రష్మిక. అప్పటినుండి వారి మధ్యన ఏదో ఉంది అంటూ పుకార్లు షికార్లు చేసాయి. అయితే తాజాగా డియర్ కామ్రేడ్ ప్లాప్ అయింది ఒక ఎత్తు, ఆ సినిమా పోవడంతో ఆ సినిమాలో తన లిప్ లాక్ పై వచ్చిన ట్రోల్స్ ఒక ఎత్తు అంటుంది రష్మిక. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గుడ్ బై ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డియర్ కామ్రేడ్ లిప్ లాక్ సీన్స్ ట్రోల్స్ ని ఆ రోజుల్లో ఎలా అధిగమించానో నాకే తెలియదు.

నేను చాలా సెన్సిటివ్ పర్సన్ ని. కొంతమంది నాకు ఫోన్ చేసి అంతా బాగానే ఉంది అనేవారు. మరికొంతమంది నన్ను దారుణంగా ట్రోల్ చేసారు. ఈ సమయంలోనే నన్ను మరింత బాధపెట్టే సంఘటనలు చాలా జరిగాయి. నేను ఎవరినో వేడుకుంటున్నట్లుగా కలలు వచ్చేవి, నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్చేదాన్ని, రాత్రంతా అలానే ఏడ్చేదాన్ని.. అంటూ తన చేదు అనుభవాలను ఆ ఇంటర్వ్యూలో రష్మిక బయటపెట్టింది.

Rashmika says she had nightmares after painful trolling:

Rashmika Mandanna opened up about being trolled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ