సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల, మెగాస్టార్ చిరు హీరో, అందులోను కొడుకు చరణ్ తో కలిసి నటించిన ఆచార్య మూవీ విడుదలనాటికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రామ్ చరణ్-చిరు ని సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ఫాన్స్ చాలా వెయిట్ చేసారు. భారీ అంచనాలు నడుమ విడుదలైన ఆచార్య సినిమాకి డిసాస్టర్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అసలు టాక్ బయటికి రాకముందే ఆచార్య కు ఓపెనింగ్స్ లేవు. చిరు సినిమా అంటే ఒకప్పుడు థియేటర్స్ ముందు టికెట్స్ కోసం కోలాహలం కనిపించేది. ట్రిపుల్ ఆర్ తో ఊపేసిన రామ్ చరణ్ సినిమా అంటే ఎలా ఉండాలి.. టకాటకా టికెట్లు తెగాలి. అలాంటిది కొన్నిచోట్ల ఆచార్య కి థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపించలేదు అంటే ఏమనుకోవాలి. కానీ చిరు-రామ్ చరణ్ కలయికని చాలామంది పట్టించుకోలేదు.
అంత బజ్ క్రియేట్ అయిన ఆచార్య సంగతే అలా ఉంటే.. రేపు రాబోయే గాడ్ ఫాదర్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు మెగా ఫాన్స్ లోనే మెదులుతున్న ప్రశ్న. సల్మాన్ ఖాన్ ఉన్నాడు, నయనతార ఉంది.. ఎలాగైనా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయనుకోవడానికి లేదు. కారణం మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ని అమెజాన్ ప్రైమ్ లో పదే పదే చూస్తున్నారు జనాలు. ఇప్పటికే ట్రైలర్ కట్ విషయంలో గాడ్ ఫాదర్ కి లూసిఫర్ కి పోలికలు పెట్టి జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి టైం లో గాడ్ ఫాదర్ కోసం క్రేజీగా ఆడియన్స్ ఎగబడరు. సూపర్ హిట్ టాక్ వస్తే దసరా హాలిడేస్ లో గాడ్ ఫాదర్ కి వర్కౌట్ అవుతుంది. అటు ట్రేడ్ నిపుణులు కూడా మొదటిరోజు గాడ్ ఫాదర్ పరిస్థితిని మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. అందుకే మెగా ఫాన్స్ గాడ్ ఫాదర్ మరో ఆచర్యలా కాకూడదు అంటూ దణ్ణం పెట్టుకుంటున్నారు.