ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఆసిన్ గుర్తుందా? ఆమె చివరిగా తెలుగులో నటించిన చిత్రం ‘అన్నవరం’. పవన్ కల్యాణ్ హీరో. అంతకుముందు బాలకృష్ణ, నాగార్జున, రవితేజ, ప్రభాస్ వంటి వారి సరసన కూడా ఆసిన్ నటించి మంచి హిట్స్ అందుకుంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో.. ఆమె తీసుకున్న నిర్ణయంతో.. మంచి వయసులో ఉండగానే సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు పొందుతున్న సమయంలోనే.. సడెన్‌గా బాలీవుడ్ నిర్ణయం తీసుకున్న ఆసిన్.. అంతే త్వరగా ఫేడవుట్ అయిపోయింది. ఇప్పుడసలు ఎక్కడుందో కూడా తెలియనంతగా.. ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయింది. దానికి కారణాలు ఏమిటనేది పక్కన పెడితే.. బాలీవుడ్‌ని నమ్ముకోవడమే.. ప్రధాన కారణమనేది.. ఆమెకి సంబంధించిన వారిని ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడామె రూటులోనే రష్మికా మందన్నా పయనిస్తుందా? అంటే అవునని చెప్పక తప్పదు.
సేమ్ టు సేమ్ ఆసిన్‌లానే రష్మిక మందన్నా అడుగులు కూడా బాలీవుడ్‌లో పడ్డాయి. అడుగు పెట్టిన మొదట్లో ఆమెలానే.. ఇప్పుడు రష్మిక కూడా అక్కడ హడావుడి చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మికా మందన్న టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. కానీ, ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ఇప్పుడామె మనసంతా బాలీవుడ్‌పైనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు, బాలీవుడ్ హీరోలను ఆమె టీజ్ చేస్తున్న తీరు, వస్తున్న అవకాశాలు, చేస్తున్న సందడి.. అన్నీ ఆసిన్‌నే తలపిస్తున్నాయి. మరి ఆమెలానే రష్మిక సినిమా లైఫ్ కూడా మారుతుందా? లేదంటే మేల్కోని జాగ్రత్త పడుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.