Advertisementt

ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారా..

Mon 03rd Oct 2022 09:30 AM
prabhas fans,adipurush teaser,prabhas  ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారా..
Prabhas fans disappointed ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారా..
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత ప్రభాస్ ఫాన్స్ వరసగా డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు. సాహో, రాధే శ్యామ్ అప్ డేట్స్ విషయంలోనూ డిస్పాయింట్ అయిన ఫాన్స్ ఆయా సినిమాల ఫలితాలతో నిరాశలోనే ఉన్నారు. సరే గతం గతః అన్నట్టుగా రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై ఫాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ పై మరింత ఆత్రుత పెంచుకున్నారు. ఆ ఆదిపురుష్ అప్ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడమే కాదు ప్రభాస్ ని రాముడిగా ఊహించుకుంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హంగామా చేసారు. ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో అంటూ తెగ ఊహించేసుకున్నారు.

కానీ ఓం రౌత్ ప్రభాస్ ఫాన్స్ ఆశలను అడియాశలు చేశారనిపిస్తుంది. ఆదిపురుష్ టీజర్ ఆదివారం రాత్రి అయోధ్యలో పది వేల మంది అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసారు. టీజర్ విజువల్ వండర్ గా ఉంది.. కానీ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. కారణం ప్రభాస్, సైఫ్, కృతి సనన్ లాంటి తారాగణంతో లైవ్ యానిమేటెడ్ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో ఆదిపురుష్ సినిమాను తెర‌కెక్కించ‌టం ప్రేక్ష‌కుల‌కే కాదు.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ కి కూడా నచ్చలేదనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. టీజర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో.. ఇలా యాంటీ హీరోల ఫాన్స్ ట్రోల్స్ స్టార్ట్ చేసేసారు. ఆదిపురుష్ టీజర్ చూస్తుంటే రజినీకాంత్ డిసాస్టర్ మూవీ కొచ్చడియాన్ గుర్తుకు వస్తుంది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన కొచ్చడియాన్ ని ఆడియన్స్ తిరస్కరించారు.

పోనీ 3D అనుకుని సరిపెట్టుకుందామనుకుంటే.. గ్రీన్ మ్యాట్‌లో సినిమాను తీసేసి దానికి టెక్నాల‌జీ ప‌రంగా పేర్లు చెబితే ఫ్యాన్స్‌కి ఎలా న‌చ్చుతుంద‌ని అంటున్నారు.. ఆరడుగుల ఆజానుబాహుడు తెరపై అలా బొమ్మలా కదలడం అనేది ఫాన్స్ కి ససేమిరా నచ్చడం లేదు. మరోపక్క టాలీవుడ్ పై ఉన్న అక్కసుని తమిళ్ తంబీలు, బాలీవుడ్ జనాలు ట్రోల్స్ తో రివెంజ్ తీర్చుకునే పనిలో బిజీగా ఉండడం ప్రభాస్ ఫాన్స్ ని మరింతగా ఆందోళన కలిగిస్తుంది.

Prabhas fans disappointed:

Prabhas Fans Are Disappointed With Adipurush Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ