జబర్దస్త్ నుండి జంప్ అయిన సుడిగాలి సుధీర్ అనసూయ తో కలిసి స్టార్ మా సూపర్ సింగర్స్ షో కి హోస్ట్ గా చేసాడు. మధ్యలో జీ ఛానల్ కి ఓ ప్రోగ్రాం కి హోస్ట్ గా చేసాడు. అయితే స్టార్ మా సూపర్ సింగర్ షో ముగిసిపోయింది. దానితో సుధీర్ ఎలాంటి టివి షోస్ లో కనిపించకపోవడంతో ఆయన ఫాన్స్ చాలా డిస్పాయింట్ అవుతున్నారు. ఈటీవీలో జబర్దస్త్, ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ బిజీగా తిరిగే సుధీర్ ఇప్పుడు టై షోలో హడావిడి చెయ్యడం లేదు అంటూ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.
జీ తెలుగులో జీ కుటుంబం అవార్డ్స్ 2022 కిరాక్ పార్టీ షో కి యాంకర్ శ్రీముఖితో కలిసి సుడిగాలి సుధీర్ హంగామా చెయ్యబోతున్న ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీముఖి అరుపులతో రెచ్చిపోగా.. సుధీర్ స్టైలిష్ గా రెచ్చిపోయాడు. ఇందులో సింగర్స్, సీరియల్ ఆర్టిస్ట్ ల పార్టిసిపేట్ చెయ్యబోతున్నారు. ఈ కిర్రాక్ పార్టీ గ్రాండ్ గా అంటూ శ్రీముఖి అంటే.. కాదు లాగ్ పార్టీ అంటూ సుధీర్ కామెడీ చెయ్యబోతున్నాడు. దానితో అక్కడ స్టార్ మా లో మునిగిన సుధీర్ ఇక్కడ జీ తెలుగు ఛానల్ లో తేలాడు అంటూ ఫాన్స్ ఉత్సాహపడుతున్నారు.