Advertisementt

ఆదిపురుష్ టీజర్: విజువల్ వండర్

Sun 02nd Oct 2022 07:42 PM
adipurush teaser,prabhas,adipurush teaser highlights  ఆదిపురుష్ టీజర్: విజువల్ వండర్
Adipurush teaser released ఆదిపురుష్ టీజర్: విజువల్ వండర్
Advertisement
Ads by CJ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.. ప్రభాస్ ఫాన్స్ కడుపు నిండిపోయే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యింది. రాముడిగా ప్రభాస్ రూపాన్ని, ఆయన డైలాగ్ డెలివరీని చూసి మైమరచిపోతున్నారు ప్రభాస్ ఫాన్స్. రాముడి పుట్టిన స్థలం అయోధ్యలో రామయ్య ఆదిపురుష్ టీజర్ లాంచ్ గ్రాండ్ గా జరుగుతున్న టైమ్ లోనే ఆదిపురుష్ టీజర్ యూట్యూబ్ లోకి వచ్చేసింది. రాముడు విల్లు ఎక్కిపెట్టి రావణుడిని టార్గెట్ చేస్తే.. నీళ్లలో రాముడు తపస్సు చేస్తూ కనిపిస్తే.. చూడడానికి రెండు కళ్ళూ చలవేమో అనేంత అద్భుత దృశ్యం. 1.40 సెకన్ల టీజర్ లో ఎన్ని పాత్రలు కనిపించినా అందరి చూపు రాముడిపైనే. విజువల్ వండర్ గా 3D ఫార్మేట్ లో తెరకెక్కిన ఆదిపురుష్ విజువల్స్ గురించి ఎంత మట్లాడుకున్నా తక్కువే. 

భూమి క్రుంగినా, నింగి చీలినా, న్యాయం చేతులలోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ అదిరిపోయింది. లంకేశ్ గా రావణుని పాత్రలో సైఫ్ అలీ ఖాన్ క్రూరత్వం, వస్తున్నా న్యాయం రెండు పాదాలతోటి, పది తలల అన్యాయాన్ని అణిచివేయ్యడానికి అంటూ తన సైన్యంతో ప్రభాస్ రామసేతుపై నడిచొస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. అధర్మ విధ్వంశం అంటూ అగ్నికీలలు మధ్యన ప్రభాస్ విల్లు ఎక్కిపెడితే.. జై శ్రీరామ్ అనడం తథ్యం. ఆదిపురుష్ టీజర్ లో ప్రతి షాట్ విజువల్ వండర్. ప్రతి పాత్రా అద్భుతమే. జానకి కృతి సనన్ కలర్ ఫుల్ ఎంట్రీ ఈ టీజర్ లో మరో అద్భుతం. ఓం రౌత్ మేకింగ్ స్టయిల్ టీజర్ కే హైలెట్ అనేలా వండర్ ఫుల్ ట్రీట్ ని ఇచ్చారంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు.

ఆదిపురుష్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Adipurush teaser released :

Prabhas Adipurush teaser review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ