Advertisementt

బిగ్ బాస్ 6: ఈ వారం ఆమె ఎలిమినేట్

Sun 02nd Oct 2022 12:26 PM
arohi rao,bigg boss 6,bigg boss telugu  బిగ్ బాస్ 6: ఈ వారం ఆమె ఎలిమినేట్
Bigg Boss 6: Arohi gets eliminated బిగ్ బాస్ 6: ఈ వారం ఆమె ఎలిమినేట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో సామాన్యమైన అమ్మాయిలా అడుగు పెట్టి ఆర్జే సూర్య తో క్లోజ్ గా మూవ్ అవుతూ బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ఓ స్థానం కోసం గట్టిగా అరుస్తూ, టాస్క్ ల పరంగా పోరాడుతూ తన ఐడెంటిటీని చూపిస్తున్న ఆరోహి రావు మొదటి వారమే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆమె ఎవరో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ అక్కడ సేవ్ అయ్యి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్స్ విషయంలోనూ ఆరోహి రావు హైలెట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ వాయిస్ రేజ్ చేస్తుంది. అయితే ఆమె టాస్క్ పరంగా బాగానే ఉన్నప్పటికీ.. బయట ఆమెకి క్రేజ్ లేకపోవడం మైనస్ గా మారడంతో బుల్లితెర ప్రేక్షకులు తమ ఓట్స్ తో ఆమెని బయటికి పంపేసినట్టుగా తెలుస్తుంది. 

ఎవరూ లేని అనాధ అంటూ కాస్త సింపతీ క్రియేట్ చేసుకున్నప్పటికీ.. ఆరోహికి ఆదరణ కరువవడంతో ఆమెని ఎలిమినేట్ చేశారంటున్నారు. సూర్య తో ఫుటేజ్ కోసం హగ్గులు, కళ్ళ నీళ్లు పెట్టుకోవడం, అలగడం ఇవేమి ఆమెకి వర్కౌట్ అవలేదని, సూర్య కూడా ఆరోహి లేకపోతె గేమ్ మీద ఫోకస్ పెడతాడనే కారణంగానే ఆరోహికి ప్రేక్షకులు ఓట్లు గుద్దలేదని, దానితో ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అంటున్నారు. నిన్నటివరకు ఆరోహి తొమ్మిదో స్థానంలో ఉండగా.. సుదీప 10 వ స్థానంలో కొనసాగడంతో సుదీపనే ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పటికీ.. అనూహ్యంగా ఆరోహి ఈ రోజు ఎలిమినేట్ కాబోతుంది. ఆల్రెడీ ఆదివారం ఎపిసోడ్ షూట్ పూర్తయ్యింది. అలా ఆరోహి ఎలిమినేషన్స్ లీకయ్యింది.

Bigg Boss 6: Arohi gets eliminated :

Arohi Rao got evicted from Bigg Boss Telugu 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ