పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ విడుదలకు సమయం దగ్గర పడుతుంది.. ప్రభాస్ ఫాన్స్ లో ఆత్రుత పెరిగిపోతుంది. నిన్న శుక్రవారం ఉదయం ఆదిపురుషుడిగా ప్రభాస్ ని చూసిన ఫాన్స్ అస్సలాగడం లేదు. విల్లు ఎక్కిపెట్టి ఆకాశానికి చూస్తున్న ప్రభాస్ లుక్ తో ఫాన్స్ పండగ చేసుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ని ఎలా చూపిస్తారో అంటూ ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ తో హంగామా చేసిన ఫాన్స్ కి ఇలా ఫస్ట్ లుక్ తో ఫుల్ ట్రీట్ ఇవ్వడంతో శాంతించారు.
ఇక రేపు అక్టోబర్ 2 ఉదయం ఆదిపురుష్ టీజర్ లాంచ్ కి అయోద్యలో అద్భుతమైన కాదు కళ్ళు చెదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సువిశాల ప్రాంగణంలో భారీ సెట్ వేసి మరీ ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ కి టీజర్ ఎంతగా ట్రీట్ ఇస్తుందో.. ఆ లాంచ్ ఏర్పాట్లు చూస్తేనే కడుపు నిండిపోయేలా కనబడుతుంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటుగా హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్, విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్.. ఇంకా ఆదిపురుష్ టీం హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ దసరా పండగ మొత్తం ప్రభాస్ ఫాన్స్ కళ్ళతోనే కనబడుతుంది.