Advertisementt

అల్లు స్టూడియో ఓపెనింగ్: చరణ్ మిస్సింగ్

Sat 01st Oct 2022 03:23 PM
megastar chiranjeevi,ram charan,allu studio  అల్లు స్టూడియో ఓపెనింగ్: చరణ్ మిస్సింగ్
Allu Studio Opening: Ram Charan Missing అల్లు స్టూడియో ఓపెనింగ్: చరణ్ మిస్సింగ్
Advertisement
Ads by CJ

అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలతో పాటుగా ఆయన కొడుకు అల్లు అరవింద్ హైదరాబాద్ కి చేరువలో నిర్మించిన అల్లు స్టూడియో ని అల్లు రామలింగయ్య అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఓపెనింగ్ కి అల్లు అర్జున్ ఆయన వైఫ్ స్నేహ, పిల్లలు అయాన్, అర్హలు, అల్లు అరవింద్ ఆయన భార్యతో సహా, అల్లు బాబీ తన భార్యతో పాటుగా అల్లు శిరీష్ లు పాల్గొన్నారు. అలాగే మెగాస్టార్ వైఫ్ సురేఖ, ఆమె అక్కయ్య, ఇంకా చిరు ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ ఈ ఈవెంట్ లో కనిపించారు. అల్లు రామలింగయ్య గారు ఆక్టర్ ఎలా అయ్యారు, ఎంతగా కష్టపడ్డారో చెబుతూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

ఇక మెగాస్టార్ చిరు ఆయన భార్య సురేఖ చేతుల మీదుగా అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాలలు వేయించారు. అయితే ఏ వేడుకకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దూరంగా ఉన్నారు. ఆయన కానీ ఆయన వైఫ్ ఉపాసన కానీ ఈ ఓపెనింగ్ లో కనిపించలేదు. ఇప్పుడే కాదు.. రీసెంట్ గా గాడ్ ఫాదర్ ఈవెంట్ అనంతపూర్ లో జరిగినప్పుడు రామ్ చరణ్ హాజరవుతారని అన్నప్పటికీ.. అక్కడ కూడా చరణ్ కనిపించలేదు. దానితో మెగా ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయినా రామ్ చరణ్ కూడా అల్లు స్టూడియో ఓపినింగ్ రోజున కనిపించి ఉంటే చాలా బావుండేది అంటున్నారు.

Allu Studio Opening: Ram Charan Missing:

Megastar launches Allu Studio

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ