సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వీ కి విజయవాడ కోర్టు షాకిచ్చింది. గత కొన్నాళ్లుగా సినిమాల్లో కామెడీ కన్నా ఈయన రాజకీయాల విషయంలో రచ్చ చేస్తున్నారు. వైసిపీ పార్టీ తరుపున ప్రచారం చేసి.. మధ్యలో పృథ్వీ కి వైసిపి పార్టీకి చెడడంతో మరోసారి మెగా హీరోలని కాకాపడుతూ జనసేనలోకి చేరిన పృథ్వీ అటు వ్యక్తిగతంగా భార్యతో ఇబ్బందులు పడుతున్నాడు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి ని వివాహం చేసుకున్న పృథ్వికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పృథ్వీ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడమే కాకుండా తన భర్త నుంచి భరణం ఇప్పించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేసింది.
అటు పృథ్వీ కూడా కొన్నిరోజులుగా భార్య, పిల్లలకి దూరంగా ఉంటున్నాను అని.. విడాకులు కూడా అప్లై చేసినట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే పృథ్వీ షూటింగ్స్ చేస్తూ నెలకి 30 లక్షలు సంపాదిస్తున్నాడంటూ శ్రీలక్ష్మి కోర్టుకి ఆధారాలతో సహా అందజేసి.. తనకి నెలకి పది లక్షల భరణం ఇప్పించాలంటూ కేసు పెట్టడంతో.. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు పృథ్వీ తన భార్యకు నెలకు 8 లక్షలు భరణంగా కింద ఇవ్వాలని ఆదేశించింది. ఆమె కేసు పెట్టినప్పటినుండి( అంటే 2017 నుండి) ఇవ్వాలని, ప్రతి నెలా 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి పృథ్వీ భరణం చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది.