Advertisementt

హిందీ గాడ్ ఫాదర్ కి సల్మాన్ సపోర్ట్.!

Sat 01st Oct 2022 12:00 PM
godfather hindi trailer,mumbai,chiranjeevi  హిందీ గాడ్ ఫాదర్ కి సల్మాన్ సపోర్ట్.!
GodFather Hindi Trailer Launch హిందీ గాడ్ ఫాదర్ కి సల్మాన్ సపోర్ట్.!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ముందు నుండి హిందీ రిలీజ్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టే రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ ని రంగం లోకి దింపాడు. మెగాస్టార్ కి అనుచరుడిగా సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే తెలుగులో గాడ్ ఫాదర్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపూర్ లో అభిమానుల మధ్యన కోలాహలంగా నిర్వహించారు. అయితే హిందీ ప్రమోషన్స్ లో భాగంగా గాడ్ ఫాదర్ టీం, ఈ రోజు మధ్యాన్న 2 గంటలకి హిందీ ట్రైలర్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. 

ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు మధ్యాన్నం జరగబోతుంది. సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ గా హాజరవుతున్నారు. మెగాస్టార్ చిరు, దర్శకుడు మోహన్ రాజాలు ముంబై చేరుకున్నారు. ట్రైలర్ లాంచ్ తో పాటుగా గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ ని నిర్వహించబోతుంది టీం. గతంలో ఆచార్య ని హిందీలో రిలీజ్ చేస్తామని అన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. కానీ గాడ్ ఫాదర్ విషయంలో దర్శకుడు మోహన్ రాజా, నిర్మాత రామ్, చరణ్ లు పక్కా ప్లానింగ్ తో హిందీ లో రిలీజ్ చెయ్యడానికి ఏర్పాట్లు పూర్తి చేసారు.

GodFather Hindi Trailer Launch:

GodFather Hindi Trailer Launch & Grand Press meet tomorrow in Mumbai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ