Advertisementt

బిగ్ బాస్ 6: ఏం పీకావ్ అంటూ నాగ్ ఫైర్

Sat 01st Oct 2022 11:44 AM
bigg boss 6,nagarjuna,adireddy  బిగ్ బాస్ 6: ఏం పీకావ్ అంటూ నాగ్ ఫైర్
Bigg Boss 6: Nagarjuna Fire on Adireddy బిగ్ బాస్ 6: ఏం పీకావ్ అంటూ నాగ్ ఫైర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి శనివారం వారం వచ్చింది అంటే కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఎక్కడ క్లాస్ ఇస్తారో అనే భయం వాళ్ళకి ఉంటుంది. గత రెండు వారాలుగా టాస్క్ పెర్ఫర్మ్ చెయ్యని వాళ్ళకి నాగార్జున ఫుల్ గా క్లాస్ ఇస్తున్నారు. నించోబెట్టి కడిగిపారేస్తున్నారు. అందుకే శనివారం వస్తే చాలు మొహం మీద నవ్వు కనబడుతున్నా.. లోపల మాత్రం భయపడుతుంటారు హౌస్ మేట్స్. ఈరోజు శనివారం ఎప్పటిలాగే నాగర్జున వచ్చేసారు.. కంటెస్టెంట్స్ కి క్లాస్ ఇచ్చేసారు. అందులో బాలాదిత్య మొహం మీద పంచ్ వేసి ఫస్ట్ కోపం వచ్చింది నీకు, అలాగే హౌస్ లో ఏడవని వారిని ఏడిపించావ్ అన్నారు. గీతు లేచి అవును సర్.. నేను ఒక రోజున్నర మాట్లాడలేదు, నన్ను మోసం చేసాడు అంది. అర్జున్ కళ్యాణ్ ని సత్య కోసం హెల్ప్ చేసి నువ్ జైలు కి వెళ్ళావ్ అనగానే శ్రీసత్య లేచింది. దానితో నాగ్ నీ పేరొస్తే వచ్చేస్తావ్ కోర్చోమ్మా అన్నారు.

ఆ తర్వాత సూర్యకి నాగ్ క్లాస్ పీకారు. వీడియో ప్లీజ్ అంటూ సూర్య అన్నం ప్లేట్ ని డస్ట్ బిన్ లో పడేసిన వీడియో చూపించి.. అన్నం పడెయ్యడం మహా పాపం. అది లేక చాలామంది ఏడుస్తున్నారు అంటూ కోపగించుకున్నారు నాగ్. తర్వాత అది రెడ్డిని నిలబెట్టి ఫుడ్ విషయంలో ఏ పనిష్మెంట్ ఇవ్వను. ఎందుకంటే అందరికి తక్కువ ఫుడ్ ఉంది. ఇటువంటివన్నీ చెప్పావ్ మాకు మా ఆడియన్స్ కి. మరేం పీకావ్ అంటూ అదిరెడ్డి పై నాగ్ ఫైర్ అయిన ప్రోమో వదిలారు.

Bigg Boss 6: Nagarjuna Fire on Adireddy:

Bigg Boss 6: Today Promo Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ