రాజమౌళి అడగాలి కానీ.. సినిమా చెయ్యననే హీరో ఉంటారా చెప్పండి. పాన్ ఇండియా డైరెక్టర్, ఎదురులేని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అలాంటి డైరెక్షర్ తో సినిమా చెయ్యను అనే హీరో ఉండరు. కానీ ఉన్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో బిజీగా వున్న మెగాస్టార్ చిరంజీవి రాజమౌళి గొప్ప డైరెక్టర్, ఆయనంటే చాలా ఇష్టం. కానీ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యాలనే కోరిక మాత్రం లేదన్నారు. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారని.. అలాగే ప్రతి విషయాన్ని రాజమౌళి డీప్‌గా చూస్తారని.. ఆయన కోరుకున్న ఔట్‌పుట్‌ను నేను ఇవ్వగలనో లేదో తనకు తెలియదన్నారు.
తాను ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తాను, కానీ రాజమౌళితో ప్రయాణం చెయ్యాలంటే మూడు నాలుగేళ్లు పడుతుంది. అందుకే రాజమౌళి తో పని చెయ్యాలని, పాన్ ఇండియా నటుడు అనిపించుకోవాలనే కోరిక లేదు అని చెప్పారు చిరు. గాడ్ ఫాదర్ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది అని చెప్పిన మెగాస్టార్ తనకి ఒక సినిమా డైరెక్షన్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.