బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంటర్ అయిన నేహా చౌదరి.. అనూహ్యంగా మూడో వారంలో ఎలిమినేట్ అవడం అందరికి బిగ్ షాక్ ఇచ్చింది. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు నేహా చౌదరి కూడా ఎక్సపెక్ట్ చేసి ఉండదు. హౌస్ లో టాస్క్ పరంగానే కాదు, అందరితో కలుపుగోలుగా ఉంటూ గలగలా మాట్లాడే నేహా చౌదరికి ఆటల్లో దెబ్బలు కూడా తగిలాయి. అలాంటి అమ్మాయిని ప్రేక్షకుల తీర్పు అంటూ బయటికి పంపడం ఎవరికీ నచ్ఛలేదు. అందుకే బయటికి వచ్చిన నేహా చౌదరి కూడా నాకన్నా తక్కువ టాస్క్ ఆడినవాళ్లు అసలు ఫ్రేమ్ లో లేని వాళ్ళు ఇంకా హౌస్ లో ఉన్నారు.. వాళ్ళ పేర్లు చెప్పను అంటూ వాసంతి అసలు గేమ్ ఆడదు, ఎవరితోనూ కలవదు.. గ్లామర్ గా డ్రెస్ చేసుకుని ఉంటుంది అందుకే ఆ అమ్మాయి హౌస్ లో ఉంది నేను బయట ఉన్నా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
అంతేకాకుండా హోస్ట్ నాగార్జునపై నేహా చౌదరి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నేను ఇనాయ విషయంలో తప్పు చేశానంటూ నాగార్జున వేలెత్తి చూపించారు. కానీ హౌస్ లో ఉన్నవాళ్లు ఇనయనే తప్పు చేసింది అన్నారు. ఆ ఎపిసోడ్ లో నన్ను హైలెట్ చెయ్యలేదు.. ఎందుకంటే నన్ను ముందుగా ఎలిమినేట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి.. నాగార్జున కొందరికి ఫెవర్ చేస్తున్నారనే విషయంలో నేను మాట్లాడాలనుకోవడం లేదు. నాకు డిప్లమేటిక్ ఆన్సర్స్ ఇవ్వడం తెలియదు. కానీ నాగార్జున గారు ఒకరిద్దరి కంటెస్టెంట్స్ విషయంలో హైలెట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ విషయంలో హౌస్ లో కూడా చర్చ జరుగుతుంది అంటూ నాగార్జున అలాగే బిగ్ బాస్ యాజమాన్యం కావాలనే తనని ఎలిమినేట్ చేసారంటూ మాట్లాడుతుంది.