సినిమాల్లో సింహంలా గర్జించొచ్చు. గ్రాఫిక్స్ తో పులిలా గాండ్రించొచ్చు.
బట్ బయట మాట్లాడే తీరులో బాలయ్య తేలిపోతున్నాడు అనుకునే అందరికీ చెక్ పెట్టింది ఆహా అన్ స్టాప్పబుల్ షో.!
బాలయ్య మాటల్లోని ప్యూరిటీని, జెన్యూనిటీని, జెంటిల్ మెన్ బిహేవియర్ ని ప్రేక్షకులకు తెలిసేలా చేసిన ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన స్పందన NEVER BEFORE.. NEVER AFTER
బాలీవుడ్ లో టాప్ షోస్ చేస్తోన్న సల్మాన్, కరణ్ వంటి వారు కూడా కళ్ళు దించి చూసేలా.. కనువిప్పు కలిగేలా చెడుగుడు ఆడేసిన బాలయ్య తన UNSTOPPABLE ని అనూహ్యమైన స్థాయిలో, అసామాన్యమైన రీతిలో నిలబెట్టారు. ఆయన మళ్ళీ రావాలని - ఆ UNSTOPPABLE టైటిల్ కి జెస్టిఫై చెయ్యాలని కోరుకుంటోన్న అసంఖ్యాక అభిమానుల కోసం మళ్లీ వచ్చేసారు బాలయ్య. ఇక చూసుకోండి ప్రతీ వీక్ గోలయ్యా .!
మొదట్లో మొహమాటంగానే ఈ షో అంగీకరించిన బాలకృష్ణ దీని ద్వారా తన అభిమానులకి ఎంత చేరువ అవుతున్నానో గ్రహించాక మరింత మనసు పెట్టి చేసారని, అందుకే మరోమారు ఈ షో చేసేందుకు అంగీకారం తెలిపారని స్వయంగా ఆయన కుమార్తె ఆనందంగా చెబుతున్నారు. మరిక బాలయ్య మనో వాంఛతో రంగంలోకి డిగాడంటే UNSTOPPABLE సెకండ్ సీజన్ కూడా సెన్సేషనే.!
ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ నారా చంద్రబాబు, నారా లోకేష్ లతో అనే న్యూస్ తెలుస్తోంది. ఆ పై పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల జోడీ కూడా లైన్ లో ఉంది. అంతే కాదు.. చిరంజీవి - చరణ్, నాగార్జున - నాగ చైతన్య, వెంకటేష్ -రానా, రామ్ - బోయపాటి శ్రీను వంటి ఎన్నో క్రేజీ కలయికలు వచ్చి బాలయ్య ముందు కూర్చోనున్నాయ్.!
అక్టోబర్ 4 న ట్రైలర్ వస్తుంది. ఆపై UNSTOPPABLE anhem మీకు మంచి కిక్కునిస్తుంది. షో స్టార్ట్ అయ్యాక మాత్రం మాటలు ఉండవ్. మాట్లాడుకోవడాలు ఉండవ్.
అదే బాలయ్య ప్రైమ్. ఇది బాలయ్య టైమ్..!!