పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్.. ఫస్ట్ లుక్ కోసం ప్రభాస్ ఫాన్స్ అల్లాడిపోయారు.. అలాగని ఊరుకోలేదు. ప్రభాస్ ని రాముడిగా ఊహించుకుంటూనే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో ప్రభాస్ ని రామావతారంలో ప్రెజెంట్ చేసాడు. ప్రభాస్ ఫాన్స్ రాముడిగా ప్రభాస్ కటౌట్ ఇలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అంటూ రకరకాల ఆకారాలతో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తయారు చేసారు. నిజంగా ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కి దర్శకుడు ఓం రౌత్ కూడా ఆశ్చర్యపోయి, ఇంరెస్ అయ్యి వాటిని సోషల్ మీడియాలో రీ పోస్ట్ చేసారంటే అభిమానుల అత్యుత్సాహం ఎలా ఉందో అర్ధమవుతుంది. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ రూపొందిస్తున్నారు.
మోస్ట్ అవేటింగ్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఈ మూవీ నుంచి ప్రభాస్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాణాన్ని ఆకాశం వైపు ఎక్కు పెట్టినట్లు ఉందీ పోస్టర్ . సినిమా క్యాప్షన్ లో రాసినట్లు చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది సినిమాలో అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ ఫాన్స్ అంచనాలకు మించి ఈ పోస్టర్ లో ప్రభాస్ కనిపించడంతో ఫాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ పోస్టర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు ఓం రావత్ స్పందిస్తూ...ఈ మ్యాజికల్ జర్నీలో భాగమయ్యేందుకు అక్టోబర్ 2న సాయంత్రం 7.11 నిమిషాలకు అయోధ్యకు వచ్చేయండి అని ఆహ్వానించారు. అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరావత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొననున్నారు.