Advertisementt

MP గా పోటీచేయడంపై నాగార్జున రియాక్షన్

Fri 30th Sep 2022 04:45 PM
nagarjuna,vijayawada,politics  MP గా పోటీచేయడంపై నాగార్జున రియాక్షన్
Nagarjuna reacts political entry MP గా పోటీచేయడంపై నాగార్జున రియాక్షన్
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున కొద్దిరోజులుగా ఆయన రీసెంట్ గా నటించిన ద ఘోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నారు. నేడు హైదరాబాద్ లో ఘోస్ట్ రిలీజ్ ట్రైలర్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేసారు. గత కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జున విజయవాడ పార్లమెంట్ స్థానానికి ఎంపీ గా పోటీ చేయబోతున్నారని, టిడిపి ఎంపీ కేశినేని నాని పైకి పోటీగా నాగార్జునని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టబోతుంది అని, జగన్ తో సన్నిహితంగా ఉండే నాగర్జున కూడా ఎంపీ గా పోటీ చెయ్యడానికి సుముఖంగా ఉన్నారనే వార్తలపై నాగార్జున ఘోస్ట్ ఈవెంట్ లో స్పందించారు. 

తాను రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రచారం జరుగుతుంది. విజయవాడంలో ఎంపీ గా పోటీ చేస్తానని వస్తున్న వార్తలు అవాస్తవం. నేను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదు. నేను ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉన్నాను. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్ గా సినిమా చేస్తాను అంటూ నాగార్జున వచ్చే ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేస్తున్నారనే ఊహాగానాలకు అడ్డుకట్ట వేసి, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.

Nagarjuna reacts political entry:

Nagarjuna clarity about Vijayawada politics

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ