బిగ్ బాస్ హౌస్ లో సింపతీ వర్కౌట్ అవుతుంది అని కీర్తి భట్ ని చూస్తే చెప్పెయ్యొచ్చు, లైఫ్ లో అన్ని కోల్పోయి ఒంటరిగా మిగిన కీర్తి భట్ అదే సింపతితో నామినేషన్స్ ఓట్స్ గెలుచుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చిన కీర్తి భట్ కి 40 శాతం ఓట్స్ పడడం మాములు విషయం కాదు. ముందునుండి టాప్ లో, స్ట్రాంగ్ గా కనిపిస్తున్న రేవంత్ ని కీర్తి భట్ దాటేసింది. ఓటింగ్ పరంగా మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ విషయంలోనూ కీర్తి భట్ నాలుగోవారంలో సింపతీ కారణంగానే కెప్టెన్ అయ్యింది.
కెప్టెన్సీ టాస్క్ లో పంచ్ పడుద్ది టాస్క్ లో మొదటగా రేవంత్ వచ్చి రాజ్ కి పంచ్ వేసి ఎలిమినేట్ చేసి సంచాలక్ అయ్యాడు. తరవాత సూర్య వాసంతి కెప్టెన్ గా పనికిరావన్నాడు. ఆ తర్వాత ఆది రెడ్డి అర్జున్ కళ్యాణ్ ని కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించాడు. బాలాదిత్య ఫైమా కి పంచ్ ఇచ్చాడు. ఇక చంటి గీతు కి పంచ్ ఇవ్వగానే గీతు సెటైరికల్ గా చంటి నీకు గేమ్ రాదుగాని కామెడీ చేస్తున్నావ్ అంది. ఇక ఈ రోజు పంచ్ టాస్క్ లో ఆరోహి కూడా అవుట్ అయ్యింది. అలాగే శ్రీ సత్య ఫస్ట్ విమెన్ కెప్టెన్ అంటూ ప్రచారం చేసినా ఆమె మొహం కూడా పగినట్లుగా తెలుస్తుంది. ఫైనల్ గా సీజన్ సిక్స్ విమెన్ కెప్టెన్ గా కీర్తి భట్ నిలిచినట్టుగా తెలుస్తుంది. కేవలం ఆమెకి ఉన్న సింపతీ కారణంగానే కీర్తి భట్ హౌస్ లో నాలుగో వారానికి కెప్టెన్ అయ్యింది అంటూ చాలామంది అంటున్నారు.