అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తోన్న తరుణం నేడు రానే వచ్చింది.
ఆదిపురుష్ లుక్ లో ప్రభాస్ ని ప్రపంచం ముందుకు తెచ్చింది.
ఈ రోజు ఉదయం ఆదిపురుష్ టీజర్ పోస్టర్ రిలీజ్ కాగా అందులో రాఘవుడిగా తన రాజసాన్ని చూపించారు ప్రభాస్. అపర పరాక్రమవంతుడైన వీరుడు నేరుగా ఆకాశానికి విల్లు ఎక్కుపెడితే... ఆ శరాఘాతాన్ని తట్టుకోలేనంటూ ఉరుములు మెరుపులతో వేడుకుంటున్న గగనం.. ఆ వైనాన్ని వీక్షిస్తోన్న సంద్రం ఆదిపురుష్ పోస్టర్ లో అమోఘంగా అమరాయి. ముఖ్యంగా ప్రభాస్ వదనంలోని గాంభీర్యం, కళ్ళలోని తీక్షణత చూపరులను కట్టిపడేసేలా ఉన్నాయి.
జస్ట్ ఫస్ట్ పోస్టర్ లోనే ఇంత ఇంటెన్సిటీని, ఇన్ డెప్త్ మీనింగ్ ని పొందు పరిచారు అంటే ఇక రేపు రానున్న టీజర్ ఇంకే రేంజ్ లో ఉంటుందో.. ఆపై వచ్చే ట్రైలర్ మనల్ని మరెంత ఊరిస్తుందో.. ఆదిపురుష్ ఫీవర్ దేశాన్ని ఎంతగా ఊపేస్తుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికైతే ఈ పోస్టర్ ఫీస్ట్ ని ఎంజాయ్ చెయ్యండి రెబెల్స్. ముందు ముందు మరింత ఉందిలే మీకు కావాల్సినంత విందు.!