బిగ్ బాస్ 6 హౌస్ లోకి సీరియల్ నటి కీర్తి భట్ అడుగుపెట్టింది. హౌస్ లోకి వెళ్ళినప్పటినుండి ఆమె ఆట పరంగా ఇంకా ఫోకస్ పెట్టలేదు. ఏదో నామినేషన్స్ టైం లో ఎవరో ఒకరి మీద అరవడం తప్ప ఆమె హౌస్ లో చేసింది ఏమి లేదు. మొన్న వారం ఎలిమినేట్ అయిన నేహా చౌదరేమో.. కీర్తి గొడ్డులా పని చేస్తుంది.. కానీ ఆమెని చూపించడం లేదు అంటుంది. అయితే గతం వారం టాస్క్ పరంగా వీక్ గా ఉన్న కీర్తిని నాగార్జున డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి పంపించాడు. ఈ వారం కూడా కెప్టెన్సీ టాస్క్ లో ఆమె పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. నామినేషన్స్ లో ఉన్న కీర్తి భట్ మొదటి స్థానంలో కొనసాగుతున్న రేవంత్ కి బిగ్ షాక్ ఇచ్చింది.
కీర్తి భట్ కి సింపతీ వర్కౌట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే కీర్తి పేరెంట్స్ మాత్రమే కాదు, ఆమె అన్నా, వదిన కూడా ఓ యాక్సిడెంట్ లో చనిపోగా కీర్తి భట్ ఆ ప్రమాదంలో గాయపడి ఓ నెలరోజుల పాటు కోమాలో ఉంది.. ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా ఆమె బిగ్ బాస్ హౌస్ లోనే కాదు, బయట కూడా పలు ఇంటర్వూస్ లో చెప్పింది. దానితో బుల్లితెర ప్రేక్షకులు ఆమె ఆట తీరు బాగోకపోయినా రెండు వారాలుగా నామినేషన్స్ లో లేకుండా.. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కీర్తి భట్ కి సింపతీ చూపిస్తూ ఓట్లు తెగ గుద్దేస్తున్నారనిపిస్తుంది. అందుకే ఆమె అనూహ్యంగా ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది.