Advertisementt

వెనక్కి తగ్గిన శాకుంతలం

Thu 29th Sep 2022 06:20 PM
shaakuntalam,samantha,gunasekhar  వెనక్కి తగ్గిన శాకుంతలం
Shaakuntalam also 3D వెనక్కి తగ్గిన శాకుంతలం
Advertisement
Ads by CJ

ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌ ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన ప్రణయ దృశ్య కావ్యం శాకుంతలం’.  మ‌హాభార‌త ఇతిహాసంలో అద్భుత‌మైన ప్రేమ ఘ‌ట్టంగా చెప్పుకుంటూ ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని ఆధారంగా చేసుకుని.. శాకుతలం చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది. శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.

శాకుంతలం చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఇలాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు మ‌ధుర‌మైన అనుభూతికి లోను కావాలి.. ఆ అనుభూతుల‌ను త‌న‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌నే త‌లంపుతో ఎపిక్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌.. శాకుంతలం సినిమాను 3Dలో ఆందించే ప్రయత్నం చేస్తున్నారు.

అత్యంత భారీ స్థాయిలో, అత్యద్భుతంగా శాకుంతం చిత్రాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం.  అందుకే, ఇంతకు ముందు ప్రకటించిన సమయానికి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం. ఇప్పటిదాకా అడుగడుగునా మమ్మల్ని ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం అని చిత్ర యూనిట్ తెలియజేసింది.

Shaakuntalam also 3D:

Shaakuntalam makers will announce a new release date soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ