Advertisementt

మహేష్ బాబుని ఓదార్చిన చిరంజీవి

Thu 29th Sep 2022 02:40 PM
megastar chiranjeevi,krishna,mahesh  మహేష్ బాబుని ఓదార్చిన చిరంజీవి
Chiranjeevi personally met and consoled Krishna garu and Mahesh మహేష్ బాబుని ఓదార్చిన చిరంజీవి
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ కృష్ణగారి మొదటి భార్య మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గారు నిన్న బుధవారం ఉదయం మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచి.. మధ్యాన్నం 12 గంటలకే అంతిమ యాత్ర మొదలు పెట్టి రెండు గంటలకి అంత్యక్రియలు పూర్తి చేసారు కుటుంబ సభ్యులు. దానితో మహేష్ బాబు ని, కృష్ణ గారిని చాలామంది నేరుగా కలిసి ఓదార్చలేకపోయారు. నిన్న ఉదయం ఇందిరాదేవి మరణ వార్త తెలియగానే నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల, రానా, మంచు విష్ణు, అడివి శేష్ ఇలా చాలామంది ప్రముఖులు మహేష్ ని, కృష్ణగారినికి ఓదార్చారు.

కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటన జరిగిన సమయంలో వైజాగ్ లో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఆయన సోషల్ మీడియాలో మహేష్ కి కృష్ణగారికి తన సానుభూతి తెలిపారు. అయితే వైజాగ్ నుండి ఆయన గాడ్ ఫాదర్ ఈవెంట్ కోసం నేరుగా అనంతపూర్ వెళ్లారు. గత రాత్రి ఆ ఈవెంట్ అవ్వగానే హైదరాబాద్ చేరుకున్న చిరు ఈ రోజు ఉదయమే ఫిలింనగర్ వెళ్లి మహేష్ బాబు, కృష్ణగారినికి కలిసి వచ్చారు. చిరు మత్రమే కాదు చాలామంది ప్రముఖులు కృష్ణ, మహేష్ ని పలకరించి వెళుతున్నారు. మహేష్ భార్య నమ్రత అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లని చూసుకుంటూ అందరిని పలకరిస్తున్నారు.

Chiranjeevi personally met and consoled Krishna garu and Mahesh:

Megastar Chiranjeevi personally met and consoled Krishna garu and Mahesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ