Advertisementt

ఫాన్స్ తో ప్రభాస్ అలా

Thu 29th Sep 2022 01:49 PM
prabhas,mogalthuru,prabhas craze at mogalthuru  ఫాన్స్ తో ప్రభాస్ అలా
Prabhas Craze at Mogalthuru ఫాన్స్ తో ప్రభాస్ అలా
Advertisement
Ads by CJ

12 ఏళ్ళ తర్వాత పెదనాన్న కృష్ణం రాజు సంస్మరణ సభకి మొగల్తూరు విచ్చేసిన ప్రభాస్ కి ఆయన అభిమానులు సాదరంగా ఆహ్వానం పలికిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈరోజు గురువారం మొగల్తూరు లో లక్షమంది అభిమానుల మధ్యన కృష్ణం రాజుగారికి సంస్మరణ సభ నిర్వహించారు ప్రభాస్ ఫ్యామిలీ మెంబెర్స్. దాని కోసం ప్రభాస్ మొగల్తూరు వెళ్లగా అడుగడుగునా ఆయనకి అభిమానులు స్వాగత సత్కారాలు చేసారు. ఫాన్స్ బైక్ ర్యాలీ, అభిమానుల సందడితో మొగల్తూరు మహా సంగ్రామంలా మారింది. ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల కోసం ఆయన టీం భారీ ఏర్పాట్లు చేసింది. సభకి వచ్చిన లక్షమంది అభిమానులకి 25 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కృష్ణంరాజుగారి తోటలో విందు ఏర్పాట్లు చేసారు. ప్రభాస్ టీం ప్రత్యేకంగా ఏర్పాట్లని దగ్గరుండి చూసుకోగా.. అత్యంత ఆప్తులైన వారికి కృష్ణం రాజుగారి ఇంటి ఆవరణలోనే భోజన ఏర్పాట్లు చేసారు.

ప్రభాస్ తన కన్నమ్మ శ్యామలాదేవి భుజం మీద చెయ్యి వేసి అభిమానులకి చూపిస్తూ మైక్ లో ఫాన్స్ ని బాగున్నారా అని అడగగానే ఫాన్స్ మైమరచిపోయారు. కృష్ణంరాజుగారి సంస్మరణ జరిగే సభా ప్రాంగణమే కాదు, మొగల్తూరు మొత్తం అభిమానులతో జనసంద్రమైంది. 

Prabhas Craze at Mogalthuru:

Prabhas at Mogalthuru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ