Advertisementt

నాన్నమ్మ మళ్ళీ తిరిగిరా: సితార ఎమోషనల్

Thu 29th Sep 2022 12:09 PM
mahesh babu,sitara,mahesh mother indiradevi  నాన్నమ్మ మళ్ళీ తిరిగిరా: సితార ఎమోషనల్
Mahesh Babu daughter Sitara shares emotional post నాన్నమ్మ మళ్ళీ తిరిగిరా: సితార ఎమోషనల్
Advertisement
Ads by CJ

నిన్న బుధవారం మహేష్ బాబు తల్లి ఇందిరాదేవిగారు అనారోగ్యంతో చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మహేష్ బాబు కన్నతల్లి మరణం పట్ల ఎంతగా భావోద్వేగంతో కనిపించారో అంతకు మించి ఆయన కూతురు సితార కన్నీళ్లు పెట్టుకుంది. నాన్నమ్మ ని అలా చూసి వెక్కిళ్లు పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. సితార ని ఊరుకోబెట్టడానికి మహేష్ ఎంతగా ప్రయత్నం చేసినా సితార మాత్రం ఏడుపు ఆపలేదు. తల్లి నమ్రత కూడా సితారని ఓదార్చింది. అయితే మద్యాన్నం ఇందిరాదేవిగారి అంత్యక్రియలు పూర్తయిన కొద్దిసేపటికి మహేష్ బాబు తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె యంగ్ ఏజ్ లో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ ప్రేమతో ఉన్న ఎమోజిలానీ షేర్ చేసారు. తర్వాత మహేష్ వైఫ్ నమ్రత అత్తమ్మని తలచుకుంటూ పోస్ట్ చేసింది. 

సితార కూడా నాన్నమ్మని తలచుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. మిస్ యు సో మచ్ నాన్నమ్మా.. నువ్వు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నా అంటూ ఎమోషనల్ గా అన్న గౌతమ్, నాన్నమ్మ తో ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్ట్ చూసిన మహేష్ ఫాన్స్ మాత్రం సితార కి నాన్నమ్మ అంటే ఎంతిష్టం.. అందుకే సితార పాప ఎమోషనల్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Mahesh Babu daughter Sitara shares emotional post :

Mahesh Babu daughter Sitara shares emotional post about grandmother IndiraDevi