Advertisementt

NBK107: టర్కీ షెడ్యూల్ ముగించేశారు

Thu 29th Sep 2022 10:27 AM
nbk 107,balakrishna,nbk 107 turkey schedule  NBK107: టర్కీ షెడ్యూల్ ముగించేశారు
NBK 107 Turkey schedule wrap up NBK107: టర్కీ షెడ్యూల్ ముగించేశారు
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ప్రస్తుతం NBK107 షూటింగ్ కోసం టర్కీ లో ఉన్నారు. ఆయన తన కొడుకు బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా అక్కడ టర్కీ NBK107 సెట్స్ లోనే చేసారు. భార్య వసుందర, కొడుకు మోక్షజ్ఞ ఇంకా మూవీ టీం తో ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసారు ఆయన. ఇదే షెడ్యూల్ లో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్న NBK107 టైటిల్ దసరా ఫెస్టివల్ రోజున రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. బాలయ్య పవర్ ఫుల్ పాత్రకి తగ్గ ఊరమాస్ టైటిల్ రాబోతున్నట్లుగా టాక్ ఉంది. 

ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ మాస్ లుక్, యాక్షన్ టీజర్ అన్ని సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు టైటిల్ కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చడం ఖాయమంటున్నారు. అయితే బాలకృష్ణ అండ్ టీం టర్కీ షెడ్యూల్ ముగించేసి హైదరాబాద్ కి పయనమయ్యారు. NBK107 టర్కీ షెడ్యూల్ పిక్ లో బాలయ్య తో పాటుగా వైఫ్ వసుంధర అలాగే కొడుకు మోక్షజ్ఞ ఉండగా.. ఇదే ఫ్రేమ్ లో గోపీచంద్ మలినేని భార్య కొడుకు కూడా ఉన్నారు. ఇక బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఆ గుడ్ న్యూస్ కూడా త్వరలోనే వస్తుంది అని వారు కలలు కంటున్నారు.

NBK 107 Turkey schedule wrap up:

NBK 107 Turkey schedule compleat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ