సౌత్ లోనే కాదు నార్త్ లోను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పుష్ప చిత్రంతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయాడు. పుష్ప చిత్రాన్ని బన్నీ అండ్ టీం ఇంకాస్త ప్రమోషన్స్ చేసి ఉంటే.. కలెక్షన్స్ పరంగా ఓ ట్రెండ్ సెట్ చేసేది. ప్రమోషన్స్ వీక్ గా ఉన్నప్పటికీ.. పుష్ప ఆ రేంజ్ హిట్ అవడం ట్రేడ్ నిపుణలనే ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రేడ్ వర్గాలు, ఆడియన్స్ నే కాదు అల్లు అర్జున్ కి కూడా పుష్ప అన్ని భాషల్లో అంతటి విజయాన్ని సాధించడం ఆశ్చర్యం కలిగించిందట. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప అంత పెద్ద హిట్ అవడం తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్పాడు.
అంతేకాదు పుష్ప చిత్రం ద్వారా తనకి వచ్చిన క్రేజ్, ఇమేజ్ ఆ సినిమాలో నటించడం వల్లే అని, ఒకవేళ ఆ సినిమాలో తాను లేకపోతే ఆ పేరు, క్రేజ్ రావడానికి ఇంకో 20 ఏళ్ళు పట్టేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. బన్నీ పుష్ప 2 పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పుష్ప 2 రెగ్యులర్ షూట్ అక్టోబర్ మూడో వారం నుండి మొదలయ్యే ఛాన్స్ ఉంది అని, పుష్ప హిట్ అవడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని, ఆ అంచనాలు తగ్గట్టుగానే పుష్ప ద రూల్ ఉండబోతుంది అని, దానికి తగ్గట్టుగానే ప్రయత్నాలు చేస్తామంటూ అల్లు అర్జున్ పార్ట్ 2 పై అంచనాలు పెంచేసాడు.