మహేష్ బాబుకి తన తల్లి ఇందిరాదేవి అంటే ఎంతిష్టమో ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. మహిళా దినోత్సవం రోజున తల్లి ఇందిరా దేవి, భార్య నమృత, కూతురు సితార ఫోటోలని షేర్ చేస్తూ విషెస్ చెప్పే మహేష్ బాబు.. తన తల్లి చేతి కాఫీ ప్రసాదంతో సమానమంటూ మహర్షి ఈవెంట్లో చెప్పారు. సినిమా రిలీజ్ రోజు ఉదయమే తల్లి దగ్గరకి వెళ్లి అమ్మ చేతి కాఫీ తాగుతాను అని, ఆ కాఫీ దేవుడి ప్రసాదంతో సమానమని, అప్పుడు ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది అని చెప్పారు. ఈరోజు బుధవారం ఉదయం మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెండంతో మహేష్ బాబు దుఖః సాగరంలో మునిగిపోయారు. తల్లి పార్థివ దేహం దగ్గర విషణ్ణవదనంతో మహేష్ కనిపించారు. తండ్రి కృష్ణగారి చేతులతో తల్లి భౌతిక కాయానికి పూల మాల వేయించిన మహేష్ కూతురు సితారని ఓదారుస్తూ చాలా డల్ గా కనిపించారు.
ఇక ఇందిరగారికి మహేష్ తలకొరివి పట్టిన దృశ్యాలు మహేష్ అభిమానులని కంటతడి పెట్టించాయి. మహేష్ బాబు వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తల్లి పాడే మోసి, తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇవన్నీ మధ్యాన్నం 2 గంటలకి పూర్తవ్వగా.. సాయంత్రానికి మహేష్ బాబు తన తల్లి యంగ్ ఏజ్ లో ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ♥️♥️♥️ అంటూ తన ప్రేమని ఎమోషనల్ గా తెలియజెయ్యడంతో.. మహేష్ ఫాన్స్ అన్నా మీకు మేమున్నాం, స్ట్రాంగ్ గా ఉండండి. స్టే స్ట్రాంగ్ మహేష్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతూ ధైర్యాన్ని ఇస్తున్నారు.